Telangana Crime: పండగపూట కొండంత విషాదం..! ‘నా చావుకు వాడు, నా భార్యే కారణం..’ గోడపై సూసైడ్‌ నోట్‌

భార్యపై కోపంతో ఆత్మహత్య చేసుకుని తనువు చాలిండాడో వ్యక్తి. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం కుటుంబానికి తీరని క్షోభ మిగిల్చింది. తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్న..

Telangana Crime: పండగపూట కొండంత విషాదం..! నా చావుకు వాడు, నా భార్యే కారణం.. గోడపై సూసైడ్‌ నోట్‌
Kamareddy Crime News

Updated on: Jan 15, 2023 | 10:10 AM

భార్యపై కోపంతో ఆత్మహత్య చేసుకుని తనువు చాలిండాడో వ్యక్తి. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం కుటుంబానికి తీరని క్షోభ మిగిల్చింది. తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్న ఈ విషాద సంఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన నక్కమూతి హనుమంతు (36), జ్యోతి భార్యాభర్తలు. స్థానికంగా హనుమంతు ఆర్టీస్ట్‌గా పని చేసేవాడు. గత కొంతకాలంగా హనుమంతు దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం భార్య పిల్లలను తీసుకొని తన పుట్టింటికి వెళ్ళిపోయింది. దీంతో మనస్థాపం చేందిన హనుమంతు ఇంట్లో ఎవరు లేని సమయంలో సీలింగ్‌ ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్ధానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు హనుమంతు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలంఓ గోడపై సూసైడ్‌ నోట్‌ కనిపించింది. ‘నా చావుకు కారణం.. నా భార్య జ్యోతి, నా అత్త, మామ, బావమరిది, జుక్కల్‌ కార్మెల్‌ స్కూల్‌ టీచర్‌ శ్రావణ్‌ గాడు. దయచేసి నా అమ్మకు న్యాయం చేయండి. ఇట్లు చిన్నాఆర్ట్స్‌’ అని రాసి ఉంది. దీనిపై మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తాకథనాల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us