AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రయాగ్‌రాజ్‌ను తలపిస్తున్న కాళేశ్వరం త్రివేణీ సంగమం.. సరస్వతి అంత్య పుష్కరాలకు భారీ ఏర్పాట్లు

Saraswati Anthya Pushkaralu: మే 21 నుంచి జూన్ 1 వరకు 12 రోజుల పాటు జరగనున్న సరస్వతి అంత్య పుష్కరాలకు కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక అలంకరణలతో ప్రాంతం కొత్త రూపు దాల్చి, ప్రయాగరాజును తలపిస్తోంది. గత ఏడాది ప్రారంభ పుష్కరాలు జరిగిన తర్వాత, ఇప్పుడు అంత్య పుష్కరాల కోసం అధికారులు అద్భుతమైన సెట్టింగ్స్‌తో ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.

ప్రయాగ్‌రాజ్‌ను తలపిస్తున్న కాళేశ్వరం త్రివేణీ సంగమం.. సరస్వతి అంత్య పుష్కరాలకు భారీ ఏర్పాట్లు
Kaleshwaram Saraswati Pushk
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: May 15, 2026 | 2:42 PM

Share

Kaleshwaram Triveni Sangamam: సరస్వతి నది అంత్య పుష్కరాలకు సమయం దగ్గర పడింది.. మే నెల 21 నుంచి జూన్ 01 వరకు 12 రోజుల పాటు జరుగనున్న అంత్య పుష్కరాలకు అదిరిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం కాళేశ్వరం త్రివేణి సంగమం సరస్వతి పుష్కరాల శోభతో కొత్త రూపుదిద్దుతుంది.. ప్రయాగరాజును తలపిస్తుంది.

గత ఏడాది సరస్వతి పుష్కరాలు జరిగాయి. తాజాగా అంత్య పుష్కరాలకు కాళేశ్వరం త్రివేణీ సంగమం వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. మే నెల 21 నుంచి సరస్వతీ నది అంత్య పుష్కరాలు నిర్వహిస్తున్నారు.. అంత్య పుష్కరాలకు అద్భుతమైన సెట్టింగ్స్‌తో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

జ్ఞాన సరస్వతి పుష్కర ఘాట్, VIP ఘాట్ వద్ద ప్రత్యేక సెట్టింగ్స్ చేశారు. సౌండ్స్ అండ్ లైటింగ్, ప్రత్యేక డెకరేషన్ చేస్తున్నారు. వీఐపీ భక్తుల కోసం 40 ఆధునిక గుడారాలతో టెంట్ సిటీ నిర్మించారు. అంత్య పుష్కరాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యే అవకాశం ఉండడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు వస్తుండడంతో కొన్ని శాశ్వత నిర్మాణాలు చేస్తున్న అధికార యంత్రాంగం.. నవరత్న హారతుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు..

అంత్య పుష్కరాలు జరిగే 12 రోజులు వివిధ ప్రాంతాల నుంచి స్వామిజీలు, పీఠాదిపతులు రానున్నారు. ప్రత్యేక హోమాలు ఉంటాయి. మొదటిరోజు 21వ తేదీ గురువారం రోజున మహా గణపతి హోమం ఉంటుంది. 22వ తేదీన సుబ్రహ్మణ్య షాడాక్షరీ హోమం, 23వ తేదీన హయగ్రీవ హోమం, 24వ తేదీన నవగ్రహ హోమం, 25వ తేదీన మహా మృత్యుజయ హోమం, 26వ తేదీన దుర్గా సూక్త హోమం, 27వ తేదీన మహా సుదర్శన హోమం, 28 వేద దక్షిణామూర్తి హోమం, 29వ తేదీన స్వయంవర పార్వతి హోమం, 30వ తేదీన ధన్వంతరి హోమం, 31వ మహారుద్ర హోమం, 01వ తేదీన లఘు చండీ మహా పూర్ణాహుతి ఉంటుంది.

వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు ఉన్న నేపథ్యంలో సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా శాశ్వత నిర్మాణాలు, ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

కాళేశ్వరం పుష్కరాల ఏర్పాట్లు వీడియో..

Follow Us