Telangana: మానవత్వం మరచిన తల్లి.. ముళ్ల పొదల్లో బాలుడు

| Edited By: Ram Naramaneni

Sep 07, 2024 | 10:36 PM

తెలుగు రాష్ట్రాల్లో ఈమధ్య కాలంలో వరుస అమానుషఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మానవత్వం మరిచి అప్పుడే పుట్టిన శిశువులను ముళ్లపొదలో పడేసి వెళ్తున్నారు. తాజాగా సిద్దిపేట జిల్లాలో మగ శిశువును ముళ్లపొదల్లో గుర్తించారు

Telangana: మానవత్వం మరచిన తల్లి.. ముళ్ల పొదల్లో బాలుడు
New Born Baby
Follow us on

రాను రాను జనాల్లో మానవత్వం మంట కలిసి పోతుంది. పదినెలలు మోసి.. ప్రాణాలకు తెగించి పురుడుపోసిన తల్లి.. కన్న పేగు బంధాన్ని తెంచుకుంటోంది. ఆభం.. శుభం తెలియని అప్పుడే పుట్టిన శిశువులను ముళ్లపొదల్లో వదిలేసి వెళ్తున్నారు. మగ శిశువును ముండ్ల పొదల్లో వదిలేసి వెళ్లిన అమానుష ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులో ఈఘటన జరిగింది. సిద్దిపేట- మెదక్ ప్రధాన రహదారి పక్కన ముళ్లపదలో అప్పుడే పుట్టిన మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు పడేసి వెళ్లారు. చిన్నారి అరుపులు విన్న కొందరు వ్యక్తులు ఘటనా స్థలానికి వెళ్లారు. వెంటనే 108కి కాల్ చేసి సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇలాంటి దారుణానికి పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలంటున్నారు స్ధానికులు.

మరోవైపు మేడ్చల్ జిల్లా గౌడవళ్లిలో ఇలాంటి అమానుష ఘటన జరిగింది. ముళ్ళ పొదల్లో పశి కందుని వదిలేసి వెళ్లారు దుండగులు. గౌడవల్లి రైల్వే గేట్ దగ్గర ముళ్ళపొదొల్లో పశి కందు ఏడుపు వినిపించగా ఆగి చూసిన ఆటో డ్రైవర్.. గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. అప్పుడు పుట్టిన ఆడశిశువుని గుర్తించి గ్రామ కార్యదర్శి ప్రధమ చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నారు.

ఇలాంటి ఘటనే ఎన్టీఆర్ జిల్లాలో రిపీట్ అయింది. తిరువూరు అయ్యప్ప స్వామి గుడి సమీపంలో పసికందును వదిలేసి వెళ్లారు. బ్రిడ్జి దగ్గర పసికందు ఏడుపులు ఉన్న స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పసికందు ఆడశిశువుగా గుర్తించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..