Crime news: ఒప్పుకున్నాడా.? ఒప్పించారా.?.. మిస్టరీగా మారుతున్న జూబ్లీహిల్స్ ఘటన

|

Mar 19, 2022 | 3:14 PM

జూబ్లీహిల్స్ కారు ప్రమాదానికి బాధ్యులైన ఇద్దరు యువకులను జూబ్లీహిల్స్ (Jubilee hills) పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సంతోష్ నగర్ కు చెందిన అబ్నాన్, మాజిద్ లను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాద సమయంలో...

Crime news: ఒప్పుకున్నాడా.? ఒప్పించారా.?.. మిస్టరీగా మారుతున్న జూబ్లీహిల్స్ ఘటన
MLA Shakeel Car Accindent
Follow us on

జూబ్లీహిల్స్ కారు ప్రమాదానికి బాధ్యులైన ఇద్దరు యువకులను జూబ్లీహిల్స్ (Jubilee hills) పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సంతోష్ నగర్ కు చెందిన అబ్నాన్, మాజిద్ లను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాద సమయంలో అబ్నాన్, మాజిద్ తో పాటు కారులో ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది.అయితే కారు డ్రైవింగ్ ఎవరు చేశారనే విషయాన్ని పోలీసులు నిర్ధారించుకోలేకపోతున్నారు. తాను డ్రైవింగ్ చేసినట్లు పోలీసుల (Police) ఎదుట అబ్నాన్‌ ఒప్పుకున్నాడు. నిజంగా అబ్నానే కారు డ్రైవ్‌ చేశాడా లేక.. ఒప్పించారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. సంఘటనా స్థలంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో దర్యాప్తు (Inquiry) ఆలస్యం అవుతున్నట్టు పోలీసులు చెబుతున్నారు. రాహిల్ ఎక్కడున్నారనే వివరాలు బయటపెట్టడం లేదు. గురువారం రాత్రి 7.30 గంటల సమయంలో గచ్చిబౌలిలోని మెక్ డొనాల్డ్ లోకి వెళ్లిన వాళ్లు.. అక్కడి నుంచి ఫిల్మ్‌నగర్ వైపు వెళ్లేందురు కారులో బయల్దేరారు. ఈ సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

గురువారం రాత్రి 9 గంటల సమయంలో మాదాపూర్‌ నుంచి టీఆర్‌ నంబరుతో ఉన్న కారు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబరు 45లోని బ్రిడ్జిని దాటి, రోడ్‌ నెంబరు 1/45 కూడలి వైపు వేగంగా వస్తోంది. బ్రిడ్జి దిగగానే ఒక్కసారిగా అదుపు తప్పిన కారు.. అక్కడే పిల్లలను ఎత్తుకొని బుడగలు విక్రయిస్తున్న మహారాష్ట్రకు చెందిన కాజల్‌చౌహాన్‌, సారిక చౌహాన్‌, సుష్మ భోంస్లేలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కాజల్‌ చౌహాన్‌ చేతిలో ఉన్న రెండున్నర నెలల పసికందు రణవీర్‌ చౌహాన్‌, సారిక చౌహాన్‌ చేతుల్లో ఉన్న ఏడాది వయసున్న అశ్వతోష్‌ కింద పడ్డారు. రణవీర్‌ చౌహాన్‌ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. మహిళలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు, ట్రాఫిక్‌ పోలీసులు 108లో జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రికి తరలించారు. చిన్నారి రణవీర్‌చౌహాన్‌ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధరించారు.

Also Read

Russia – Ukraine Crisis: క్షిపణులతో విరుచుకు పడుతున్న పుతిన్ సైన్యం.. TV9 Exclusive Report

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ వైద్యులు, వైద్య సిబ్బందికి సర్కార్ కఠిన ఆదేశాలు.. అలా చేస్తే సెలవుల్లో కోతే

IND vs AUS: ఆనాడు సెంచరీ, ఈనాడు హాఫ్ సెంచరీ.. ఆసీస్‌పై తగ్గేదేలే అంటోన్న హర్మన్‌ప్రీత్ కౌర్..