School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 10, 11న పాఠశాలలకు సెలవు!

School Holidays: నిత్యం హోం వర్క్, ఇతర ప్రాజెక్టు వర్క్‌లతో బిజీగా ఉండే విద్యార్థులకు ఇది కాస్త ఉపశమనంగా ఉంటుంది. చాలా వరకు పాఠశాలలు రెండో శనివారం కూడా సెలవు ఇస్తున్నాయి. సాధారణంగా ఎక్కువ శాతం ఓటింగ్‌ స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయంలోనే నిర్వహిస్తారు..

School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 10, 11న పాఠశాలలకు సెలవు!

Updated on: Nov 08, 2025 | 2:56 PM

School Holidays: పాఠశాలలకు సెలవు వస్తుందంటే చాలు విద్యార్థులు ఎగిరిగంతులేస్తారు. ఒక్క రోజు సెలవు వచ్చినా ఎంజాయ్‌ చేయాలనుకుంటారు విద్యార్థులు. అయితే హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈనెల 11న నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఈ మేరకు ఆ రోజు సెలవు ప్రకటిస్తూ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన ఉత్తర్వులు జారీ చేశారు. పోలింగ్ కు ముందురోజు ఈ నెల 10న పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన పాఠశాలలు, కార్యాలయాలకు మాత్రమే సెలవు ఇవ్వగా.. పోలింగ్ రోజు 11వ తేదీన నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, ఆఫీసులకు, సంస్థలకు సెలవు ఇచ్చారు.

ఇది కూడా చదవండి: PM Kisan: ఈ రైతులకు నిలిచిపోనున్న పీఎం కిసాన్‌ స్కీమ్‌.. అసలు కారణం ఇదే!

అలాగే14వ తేదీన కౌంటింగ్ నాడు లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేసిన చోట మాత్రమే సెలవు ప్రకటించారు. ఆయా చోట్ల పనిచేసే ఉద్యోగులకు పెయిడ్ హాలిడే ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు కలెక్టర్‌. ఈ విధంగా విద్యార్థులకు రెండు రోజుల పాటు సెలవు రానుండగా, ఓట్ల లెక్కింపు ఉన్న ప్రాంతాల్లో అంటే 14న మరో రోజు సెలవు రానుంది. పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసిన పాఠశాలల్లో వరుసగా 10,11వ తేదీల్లో సెలవులు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: IRCTC New Rule: వీరు ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు రైలు టికెట్లు బుక్‌ చేసుకోలేరు!

నిత్యం హోం వర్క్, ఇతర ప్రాజెక్టు వర్క్‌లతో బిజీగా ఉండే విద్యార్థులకు ఇది కాస్త ఉపశమనంగా ఉంటుంది. చాలా వరకు పాఠశాలలు రెండో శనివారం కూడా సెలవు ఇస్తున్నాయి. సాధారణంగా ఎక్కువ శాతం ఓటింగ్‌ స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయంలోనే నిర్వహిస్తారు. ఓటర్లు ఈ వెసులుబాటును వినియోగించుకుంటారు. నవంబర్ 11వ తేదీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా స్కూళ్లలో ఎన్నికల బ్యాలెట్లు ఏర్పాటు చేస్తారు.

ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కును కూడా వినియోగించుకుంటారు. జూబ్లీహిల్స్ పరిధిలోని అన్ని పబ్లిక్, ప్రైవేట్ విద్యాసంస్థలతోపాటు ప్రభుత్వ కార్యాలయాలకు వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటించారు. ఈనెల 5వ తేదీన కార్తీక పౌర్ణమి, గురునానక్‌ జయంతి సందర్భంగా కూడా స్కూళ్లకు సెలవు ప్రకటించారు.

ఇది కూడా చదవండి: PM Kisan: పీఎం కిసాన్‌ 21వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలుసా?

ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ తరఫున దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత బరిలోకి దిగగా.. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి దీపక్‌ రెడ్డి ఎన్నికల బరిలో ఉన్నారు.

ఇది కూడా చదవండి: Smart TV: 55-అంగుళాల స్మార్ట్ టీవీ కేవలం 20,999కే.. అద్భుతమైన ఫీచర్స్‌

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి