Telangana Congress: చేవెళ్ల ప్రజాగర్జన సభతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో జోష్‌.. డిక్లరేషన్‌తో ఎస్సీ, ఎస్టీలపై భారీగా వరాల జల్లు..

తెలంగాణలో హస్తం పార్టీ అధికారంలోకి వస్తే డిక్లరేషన్‌లో ప్రకటించిన 12 హామీలను అమలు చేస్తామని ప్రకటించారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. అవును, కర్నాటక ఫలితాలు, ఖమ్మం రాహుల్‌ సభ, ఇప్పుడు చేవెళ్ల ప్రజాగర్జన సభతో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు మరింత దూకుడు పెంచారు. చేవెళ్ల సెంటిమెంట్‌తో ముందుకెళ్లాలని భావిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ చేవెళ్ల కేవీఆర్‌ మైదానంలో జరిగిన సభకు భారీ జనసమీకరణ చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ముందుగా వేదికపై గద్దర్‌ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఖర్గే సమక్షంలో ఆర్మూర్‌ నేతలు రాజేందర్‌, వినయ్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, ఉస్మానియా యూనివర్శిటీ..

Telangana Congress: చేవెళ్ల ప్రజాగర్జన సభతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో జోష్‌.. డిక్లరేషన్‌తో ఎస్సీ, ఎస్టీలపై భారీగా వరాల జల్లు..
Mallikarjun Kharge
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 26, 2023 | 10:25 PM

చేవెళ్ల ప్రజాగర్జన సభతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో జోష్‌ పెరిగింది. సభా వేదికగా ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ ప్రకటించారు పిసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి. తెలంగాణలో హస్తం పార్టీ అధికారంలోకి వస్తే డిక్లరేషన్‌లో ప్రకటించిన 12 హామీలను అమలు చేస్తామని ప్రకటించారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. అవును, కర్నాటక ఫలితాలు, ఖమ్మం రాహుల్‌ సభ, ఇప్పుడు చేవెళ్ల ప్రజాగర్జన సభతో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు మరింత దూకుడు పెంచారు. చేవెళ్ల సెంటిమెంట్‌తో ముందుకెళ్లాలని భావిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ చేవెళ్ల కేవీఆర్‌ మైదానంలో జరిగిన సభకు భారీ జనసమీకరణ చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ముందుగా వేదికపై గద్దర్‌ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఖర్గే సమక్షంలో ఆర్మూర్‌ నేతలు రాజేందర్‌, వినయ్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థినేత కోట శ్రీనివాస్‌ చేరారు.

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి 12 అంశాలతో కూడిన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్‌ ప్రకటించారు. అంబేద్కర్ అభయహస్తం పేరుతో 12 లక్షల ఆర్థిక సహాయం, ఎస్సీలకు 18శాతం, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు, ప్రైవేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల అమలు, ఇందిరమ్మ ఇంటి స్కీమ్, స్థలం లేని వాళ్ళకి స్థలం ఇచ్చి రూ. 6 లక్షల ఆర్థిక సహాయం, అసైన్డ్, అటవీభూములు, పొడు భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తామని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్‌ చదవడంతో తన జన్మ ధన్యమైందని, పార్టీ అధికారంలోకి రాగానే వర్గీకరణ చేస్తామన్నారు రేవంత్‌రెడ్డి.

ఇవి కూడా చదవండి

రేవంత్‌ ప్రకటించిన 12 అంశాల డిక్లరేషన్‌ హామీలు పార్టీ అధికారంలోకి రాగానే అమలు చేస్తామని హామీ ఇచ్చారు ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే. తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధమయ్యారన్నారు. తెలంగాణ కోసం అన్ని వర్గాల ప్రజలు పోరాటం చేస్తే.. తనవల్లే తెలంగాణ వచ్చిందని కేసీఆర్‌ చెబుతున్నారని విమర్శించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని విపక్షాలు ఏకమైతే, సెక్యులర్‌ పార్టీ అని చెప్పుకునే కేసీఆర్, ఒక్క సమావేశానికి రాలేదని మండిపడ్డారు. కేసీఆర్‌.. బయట బీజేపీని తిడతారు, లోపల మంతనాలు జరుపుతారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఖర్గే.

తెలంగాణలో ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని విమర్శించారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. పాదయాత్రలో దళితుల సమస్యలు విని, ఖర్గే ధృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. దళితులకు 3 ఏకరాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌, వారిని మోసం చేశారని మండిపడ్డారు. సీఆర్‌ పాలనలో దళితులు, గిరిజనులు మోసపోయారని, అందుకే..ఆదుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ దళిత, గిరిజన డిక్లరేషన్‌ ప్రకటించిందని ఆ పార్టీ నేతలు తెలిపారు. మొత్తానికి సభకు భారీగా జనం తరలిరావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..