Summer Effect: ఇవి మామూలు కోతులు కాదండోయ్.. భక్తుల కోసం ఏర్పాటు చేస్తే వానర సేన వచ్చి ఏం చేసిందంటే..

|

Mar 06, 2021 | 1:24 AM

Summer Effect: ఎవరైనా అల్లరి చేస్తే కోతి చేష్టలు మానవా? అంటుంటాం. కారణం కోతి చేసే అల్లరి అలా ఉంటుంది.

Summer Effect: ఇవి మామూలు కోతులు కాదండోయ్.. భక్తుల కోసం ఏర్పాటు చేస్తే వానర సేన వచ్చి ఏం చేసిందంటే..
Follow us on

Summer Effect: ఎవరైనా అల్లరి చేస్తే కోతి చేష్టలు మానవా? అంటుంటాం. కారణం కోతి చేసే అల్లరి అలా ఉంటుంది. మరి. ఒక కోతి అల్లరికే ఆగమాగం అయ్యే జనాలు.. ఏకంగా వానరసేన చేసే హడావుడి ముందు నిలవగలరా?. నెవ్వర్ అంటే నెవ్వర్ అని చెప్పాల్సిందే. తాజాగా జనగామ జిల్లాలో కోతులకు సంబంధించి ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. మహాశివరాత్రి సమీపిస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలన్నింటా బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వయంభు శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈ నెల 10 తేదీ నుండి 14 వ తేదీ వరకు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆలయానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందలు పడకూడదనే ఉద్దేశంతో పెండింగ్‌లో ఉన్న నిర్మాణ పనులను సైతం వేగంగా పూర్తి చేస్తున్నాయి. ఇక ఆలయానికి వచ్చే భక్తుల కోసం స్నాన ఘట్టాలు ఏర్పాటు చేశారు. ఆ స్నాన ఘట్టాలే వానరసేన సరదాలకు వేదికగా నిలిచింది. ఎండాకాలం పూర్తిగా రాకపోయినప్పటికీ ఎండలు దాదాపు మండిపోతున్నాయి. మధ్యాహ్నం అయ్యే సరికి బయటికి వెళ్లాంటే భయపడే పరిస్థితులు అప్పుడే వచ్చాయి. అయితే, ఈ ఎండ వేడిమిని తాళలేక కోతుల గుంపు.. ఆ స్నాన ఘట్టాల్లోకి దూకాయి. అందులో ఈత కొడుతూ కాసేపు సేద తీరాయి. ఎండ వేడిమి నుంచి తట్టుకునేందుకు ఈత కొడుతూ ఆలయ ప్రాంగాణంలో తిరుగుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నాయి.

Also read:

Viral video : దాహంతో ఉన్న పాముకు నీళ్లు తాగించాడు.. తర్వాత ఆ పాము ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు..

Actress Poorna : ఆ నటుడు ఈ హీరోయిన్ కు డ్రగ్స్ తీసుకోవడం నేర్పించాడట.. షాకింగ్ న్యూస్ చెప్పిన పూర్ణ

ఈ పది సెకండ్స్ వీడియో ఏకంగా రూ. 48 కోట్లకు అమ్ముడైంది.. ఎందుకు అంత ధర పలికిందో తెలుసా.!