కుస్తీ పోటీలకు ఏమీ తీసిపోకుండా పందుల, కుక్కల పోటీలు.. భారీ ఫ్రైజులు.. మన తెలంగాణలోనే.. ఎక్కడంటే..?

అక్కడ జనాల గుంపు ఎందుకు ఉందో తెలుసా..! ఇక్కడ ఏం జరుగుతుందనే కదా మీ డౌట్...! అవును ఇక్కడ సాధారణమైన విషయమేమీ జరగడం లేదు. మీరు ఎప్పుడూ చూడనిదే అనుకోవచ్చు.

  • Ram Naramaneni
  • Publish Date - 9:39 pm, Fri, 5 March 21
కుస్తీ పోటీలకు ఏమీ తీసిపోకుండా పందుల, కుక్కల పోటీలు.. భారీ ఫ్రైజులు.. మన తెలంగాణలోనే.. ఎక్కడంటే..?

అక్కడ జనాల గుంపు ఎందుకు ఉందో తెలుసా..! ఇక్కడ ఏం జరుగుతుందనే కదా మీ డౌట్…! అవును ఇక్కడ సాధారణమైన విషయమేమీ జరగడం లేదు. మీరు ఎప్పుడూ చూడనిదే అనుకోవచ్చు. కుస్తీ పోటీలకు ఏమీ తీసిపోకుండా జరుగుతున్న పోటీలివి. ఇంతకీ అక్కడ జరుగుతున్నది ఏం పోటీలు అని ఆలోచిస్తున్నారా…? గుంపులో నుంచి వేగంగా దూసుకొచ్చి తలపడుతున్నాయి చూశారా. అవును, అవి పందులే. ఇక్కడ జరుగుతుంది కూడా పందుల పోటీలే. పందులతో పోటీ ఏంటి అనుకుంటున్నారా… మరి ఇక్కడ ఇదే స్పెషల్ అంటున్నారు నిర్వాహకులు. సంక్రాంతికి ఏపీలో కోళ్ల పందాల మాదిరిగా ఇక్కడ పందుల బల ప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నారు. ఓన్లీ పందులే కాదు కుక్కలకు కూడా పోటీలు నిర్వహిస్తున్నారిక్కడ. ఈ పందుల పోటీలు ఉత్తిత్తినే కాదు..భారీ ఫ్రైజులు కూడా ఉన్నాయి.

ప్రథమ బహుమతి పొందిన పందికి 30,016 ఇస్తారు. మరి కుక్కల పోటీ తక్కువేం కాదు. పోటీలో గెలుపొందిన కుక్కకు 15,016 ఫ్రైజ్‌ మనీ ఇస్తున్నారు. ఈ పోటీలు జరుగుతుంది ఎక్కడో కాదు…తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా అయిజలో. ఇక్కడ 1960 నుంచి ప్రతీ యేడాది శ్రీతిక్క వీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది మార్చి 1న ప్రారంభమైన ఉత్సవాలు..11వ తేదీ వరకు నిర్వహిస్తారు. అయితే… ఇక్కడ ప్రతీ యేడాది జరిగే పెంపుడు జంతువుల ప్రద్శన పోటీలు ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రధానంగా పందుల బల ప్రదర్శన పోటీలు ఇక్కడ ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు తెలంగాణతో పాటు ఏపీ, కర్ణాటక రాష్ట్రాల నుంచి పందులు, కుక్కలను తీసుకుని వస్తున్నారు. రింగ్‌లోకి దిగిన పందులు హోరా హోరీగా తలపడుతుంటే ఆడియన్స్‌ కేరింతలు కొడుతూ ఎంజాయ్‌ చేస్తున్నారు. పోటీల్లో పాల్గొనేందుకు వచ్చే వారికి, చూసేందుకు వచ్చేవారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు నిర్వాహకులు. మంచినీరు, పారిశుద్ధ్యం వంటి ఏర్పాట్లు చేశారు. అటు.. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఉచిత భోజన సదుపాయం కూడా కల్పించారు. మరి ఈ పందులను డైరెక్ట్‌గా బరిలో దింపరు. వాటికి ఇవ్వాల్సిన ట్రైనింగ్, ఫిట్నెస్‌ వాటికి ఇస్తారు. పందులకు రోజూ రాగులు, ఉలువలు, జొన్నలు వంటి బలమైన ఆహారాన్ని ఇస్తారు. డైలీ వాకింగ్‌ కూడా చేయిస్తారు. ఆహారం కోసం ఒక్కో పందిపై రోజుకు రూ. 500 ఖర్చు చేస్తామని పందుల యజమానులు చెప్తున్నారు.

Also Read:

వీళ్లు కొత్తరకం దొంగలు.. పెళ్లికి వస్తారు.. బహుమతులు కొట్టేస్తారు.. పక్కా స్కెచ్‌తో

భర్తలో లోపం ఉందంటాడు.. సంతానం కావాలంటే తాను చెప్పింది వినాలంటాడు.. కృష్ణా జిల్లాలో కంత్రీ డాక్టర్