AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Poorna : ఆ నటుడు ఈ హీరోయిన్ కు డ్రగ్స్ తీసుకోవడం నేర్పించాడట.. షాకింగ్ న్యూస్ చెప్పిన పూర్ణ

టాలీవుడ్ హీరోయిన్స్ లో టాలెంటెడ్ హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు వారిలో పూర్ణ ఒకరు. ఈ అమ్మడు విభిన్నమైన కథలను ఎంచుకుంటూ.. దూసుకుపోతుంది. అల్లరి నరేష్ హీరోగా వచ్చిన 'సీమ టపాకాయ్' సినిమాతో తెలుగు వారికి పరిచయం.

Actress Poorna : ఆ నటుడు ఈ హీరోయిన్ కు డ్రగ్స్ తీసుకోవడం నేర్పించాడట.. షాకింగ్ న్యూస్ చెప్పిన పూర్ణ
విభిన్నమైన కథలను ఎంచుకుంటూ.. దూసుకుపోతుంది హీరోయిన్ పూర్ణ 
Rajeev Rayala
|

Updated on: Mar 05, 2021 | 2:03 PM

Share

Actress Poorna : టాలీవుడ్ హీరోయిన్స్ లో టాలెంటెడ్ హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు వారిలో పూర్ణ ఒకరు. ఈ అమ్మడు విభిన్నమైన కథలను ఎంచుకుంటూ.. దూసుకుపోతుంది. అల్లరి నరేష్ హీరోగా వచ్చిన ‘సీమ టపాకాయ్’ సినిమాతో తెలుగు వారికి పరిచయం.. ‘అవును’, ‘లడ్డుబాబు’, ‘అవును 2’ మొదలగు సినిమాలు చేసి పాపులర్ అయ్యింది. ఇప్పుడు ఈ బ్యూటీ విలన్ రోల్స్ చేయడానికి సిద్దమవుతుంది. నటనకు ప్రాధాన్యత ఉంటే నెగిటివ్ రోల్స్ చేయడానికి కూడా రెడీ అంటుంది.

తాజాగా పూర్ణ విలన్ అవతారం ఎత్తనుంది. హీరో రాజ్ తురుణ్ నటిస్తున్న తాజా చిత్రం మూవీ ‘పవర్ ప్లే’.  విభిన్నమైన కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా మార్చి 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థ్రిల్లర్ జానర్ లో రాబోతున్న ఈ సినిమాలో కీలక పాత్రలో నటించింది పూర్ణ. ఈ సినిమాలో మొదటి సారిగా విలన్ క్యారెక్టర్ ప్లే చేస్తున్న పూర్ణ.. ఇందులో డ్రగ్స్ అడిక్ట్ గా కనిపించబోతోంది.ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన పూర్ణ ఆసక్తికర విషయాలను వెల్లడించింది.  డ్రగ్స్ సేవించడం, షూటింగ్ సమయంలో ఎదుర్కొన్న అనుభవాలను పంచుకుంది పూర్ణ.

అయితే డ్రగ్స్ తీసుకునే వ్యక్తిగా కనిపించడానికి చాలా కష్టపడ్డానని తెలిపింది. డ్రగ్స్ తీసుకోవడం తనకు రాకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డాడని తెలిసుపింది పూర్ణ. డ్రగ్స్ ను రకరకాలుగా తీసుకుంటారు. ఇంజెక్షన్ రూపంలో  వెయిన్ కు తీసుకుంటారు. పౌడర్ తరహావి ముక్కుతో పీలుస్తారు. అయితే డ్రగ్స్ ముక్కుతో పీల్చే సన్నివేశంలో తనకు డ్రగ్స్ తీసుకోవడం రాకపోవడంతో ముక్కులోకి వెళ్లిపోయేదని తెలిపింది. ఈ క్రమంలో సెట్ లో ఉన్న ఓ నటుడు ఎలా పీల్చాలో నేర్పించాడట. ఆ వ్యక్తి సహాయంతో ఆ సన్నివేశన్ని పూర్తి చేసానని తెలిపింది పూర్ణ .

మరిన్ని ఇక్కడ చదవండి : 

Aarthi Agarwal : సినిమాల్లో తనదైన ముద్రవేసి తిరిగిరానిలోకాలకు వెళ్ళిపోయినా అందాల ఆర్తి అగర్వాల్

Shanmukh Jaswanth: కౌన్సిలింగ్‌కు హాజరుకాని షణ్ముక్ జస్వంత్.. పోలీసులు సీరియస్..