చిన్న వయస్సులోనే అనుకోని కారణాల వలన కన్ను మూసిన తన సినిమాలతో ఇప్పటికీ తెలుగువారిని అలరిస్తూనే ఉంది అందాల నటి ఆర్తి అగర్వాల్ . ఈరోజు ఆర్తి అగర్వాల్ 37వ జయంతి.
Follow us
చిన్న వయస్సులోనే అనుకోని కారణాల వలన కన్ను మూసిన తన సినిమాలతో ఇప్పటికీ తెలుగువారిని అలరిస్తూనే ఉంది అందాల నటి ఆర్తి అగర్వాల్ . ఈరోజు ఆర్తి అగర్వాల్ 37వ జయంతి.
14 సంవత్సరాల వయసులో మోడలింగ్‌రంగంలోకి ప్రవేశించింది ఆర్తి అగర్వాల్ . ఫిలడెల్ఫియాలోని ఓ స్టేజ్ షోలో ఆర్తీ అగర్వాల్ డాన్స్ చూసి ముచ్చటపడిన అమితాబ్ బచ్చన్.. ఆమెను హిందీలో యాక్ట్ చేయడానికి ఎంకరేజ్ చేశాడు.
ఆర్తిఅగర్వాల్ 2001వ సంవత్సరంలో హిందీలో పాగల్పన్ అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత ఆర్తి అగర్వాల్ తెలుగులో ప్రముఖ దర్శకుడు కే విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ అనే చిత్రం ద్వారా తన 16వ యేట టాలీవుడ్‌కు పరిచయమైంది.
ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఆర్తి అగర్వాల్.. కొన్ని సంవత్సరాలు తెలుగులో టాప్ హీరోయిన్గా రాణించింది. అంతేకాదు ఈమె తెలుగులో దాదాపుగా స్టార్ హీరోలు అందరి సరసన నటించి మెప్పించింది ఈ గుజరాతి బ్యూటీ . తెలుగులో సుమారు 50కి పైగా సినిమాల్లో నటించింది ఆర్తి.
ఆర్తి అగర్వాల్ ఊహించని విధంగా జూన్ 6 న 2015వ సంవత్సరంలో మరణించింది. ఆర్తి అగర్వాల్ వరుస అవకాశాలతో బిజీబిజీగా గడుపుతున్న సమయంలోనే అనుకోకుండా కాస్తా బరువు పెరిగింది. ఈ కారణంగా ఆమెకు సినీ అవకాశాలు తగ్గిపోయాయి. దీనికి తోడు ఆమె పర్సనల్ విషయాల్లో కూడా కాస్తా డిస్ట్రబ్ అయ్యిందని టాక్.
ఓ వైపు పర్సనల్ రీజన్స్.. మరోవైపు సినిమాల్లో అవకాశాలు తగ్గడం ఆమెను కలచివేశాయి. దాంతో ఆర్తి అగర్వాల్ తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో ఎలాగైనా సరే బరువు తగ్గాలని వర్కౌట్లు చేయడం మొదలు పెట్టింది. పెళ్లి తర్వాత రెండవ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఆర్తీ… హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించింది.
ఓ సినిమాలో పాత్ర కోసం ఆర్తి కాస్తా బరువు తగ్గాల్సివచ్చింది. అయితే అప్పటికే 89 కేజీల బరువున్న ఆర్తి 63 కేజీలకు తగ్గింది. ఇక మరో మూడు కేజీల బరువు తగ్గడం కోసమని లైపో సెక్షన్ చేయించుకుంది. అయితే ఈ సర్జరి తర్వాత కొంత కాంప్లికేట్ అయ్యి ఆపరేషన్ వికటించి గుండెపోటుతో ఆర్తి అగర్వాల్ అకాల మరణం చెందింది.