AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అక్క అనుమానస్పద స్థితిలో మృతి.. చెల్లె పరారి.. సంచలనం సృష్టిస్తున్న మిస్టరీ మృతి..

అక్కా చెల్లెల్లు అప్పటి వరకు ఆనందంగా గడిపారు.. శుభ కార్యక్రమం కోసం తల్లిదండ్రులు హైదరాబాద్‌కు వెళ్లారు. జాగ్రత్తగా ఉండాలని పేరెంట్స్ చెప్పి వెళ్లిపోయారు.. అలా వెళ్లిన వారు తిరిగి ఇంటికి వచ్చే సరికి.. ఓ కూతురు విగత జీవిగా మారగా.. మరో కూతురు ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇంతకీ ఏం జరిగింది.. ఇప్పుడు తెలుసుకుందాం. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని భీముని దుబ్బ ప్రాంతంలో యువతి మృతి సంచలనంగా మారింది. ఈ కేసులో పోలీసులకు అనేక ట్విస్ట్ లు కనిపించాయి. యువతి అనుమానాస్పద మృతితో పాటు ఆమె సోదరి అదృశ్యం సంచలనంగా మారింది.

Telangana: అక్క అనుమానస్పద స్థితిలో మృతి.. చెల్లె పరారి.. సంచలనం సృష్టిస్తున్న మిస్టరీ మృతి..
Jagtial Murder
G Sampath Kumar
| Edited By: Shiva Prajapati|

Updated on: Aug 30, 2023 | 12:23 PM

Share

అక్కా చెల్లెల్లు అప్పటి వరకు ఆనందంగా గడిపారు.. శుభ కార్యక్రమం కోసం తల్లిదండ్రులు హైదరాబాద్‌కు వెళ్లారు. జాగ్రత్తగా ఉండాలని పేరెంట్స్ చెప్పి వెళ్లిపోయారు.. అలా వెళ్లిన వారు తిరిగి ఇంటికి వచ్చే సరికి.. ఓ కూతురు విగత జీవిగా మారగా.. మరో కూతురు ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇంతకీ ఏం జరిగింది.. ఇప్పుడు తెలుసుకుందాం..

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని భీముని దుబ్బ ప్రాంతంలో యువతి మృతి సంచలనంగా మారింది. ఈ కేసులో పోలీసులకు అనేక ట్విస్ట్ లు కనిపించాయి. యువతి అనుమానాస్పద మృతితో పాటు ఆమె సోదరి అదృశ్యం సంచలనంగా మారింది. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఒక సోదరి కనిపించకుండా పోవడం, మరొక సోదరి విగత జీవిగా ఇంట్లో పడి ఉండడం స్థానికంగా సంచలనంగా మారింది.

కీలకంగా మారిన ఫుటేజ్..

బస్ స్టేషన్‌‌లో దొరికిన సిసి ఫుటేజ్ కీలకంగా మారింది. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో నివాసముండే శ్రీనివాస్ రెడ్డి, మాధవి దంపతులకు ఇద్దరు కూతుర్లు ఒక కుమారుడు ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి దంపతులు సోమవారం బంధువుల గృహప్రవేశానికి హైదరాబాద్ వెళ్లారు. కుమారుడు హైదరాబాదులో చదువుతున్నాడు. ఇద్దరు కూతుర్లు దీప్తి, చందన ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్. ఇద్దరూ వర్క్ ఫ్రమ్ హోమ్‌ చేస్తున్నారు. అయితే, మంగళవారం ఉదయం ఇద్దరు కూతుర్ల ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉండడంతో శ్రీనివాస్ రెడ్డి ఎదురింటి వారికి ఫోన్ చేసి ఇంటి వద్ద తమ కూతుర్ల ఫోన్లు పనిచేయడం లేదని.. ఒకసారి తెలుసుకొని చెప్పమని కోరడు. దాంతో పక్కింటి వారు వెళ్లి చూడగా పెద్ద కూతురు దీప్తి సోఫాలో విగతజీవిగా పడి ఉంది. దీంతో వారు పోలీసులకు, తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

హుటాహుటి ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. కొన్ని క్లూస్ సేకరించారు. అదే ఇంట్లో ఉండాల్సిన మృతురాలి సోదరి చందన ఇంట్లో కనిపించకుండా పోవడంతో ఆమె ఆచూకి కోసం పోలీసులు గాలించారు. చివరకు బస్టాండ్‌లో ఉన్న సిసి ఫుటేజ్ లో చందనతో పాటు మరో యువకుడు బస్సు ఎక్కడం గుర్తించారు. దీంతో దీప్తి మరణానికి, చెల్లెలి ఆచూకికి లింకు ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని లోతుగా విచారిస్తున్నారు.

తల్లిదండ్రులు మాత్రం తాము బంధువుల గృహప్రవేశానికి హైదరాబాద్ వెళ్లామని, రాత్రి తమ కూతుర్లతో మాట్లాడామని, ఉదయం వస్తున్నట్లు తెలిపామన్నారు. ఇంతలో రాత్రి ఇంటి వద్ద ఏం జరిగిందో తమకు తెలియదన్నారు. ఆధారాలు సేకరిస్తున్న పోలీసుల.. ఈ కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు చెల్లెలు, ఆమెతో వెళ్లిన యువకుడిని పట్టుకోడానికి రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..