Jagtial Election Result 2023: జగిత్యాలలో బీఆర్‌ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్ విజయం

Jagtial Assembly Election Result 2023 Live Counting Updates: జగిత్యాల నియోజకవర్గం 1957లో ఏర్పడింది. తెలంగాణ వచ్చాక డివిజన్‌ కేంద్రం కాస్తా 2014లో జిల్లా కేంద్రంగా మారడంతో జగిత్యాల ఎంతో అభివృద్ధి చెందింది. నియెజకవర్గంలో జగిత్యాల మున్సిపాలిటీతోపాటు, జగిత్యాల అర్బన్‌, రూరల్‌, సారంగాపూర్‌, బీర్‌పూర్‌, రాయికల్‌, మండలాలున్నాయి.

Jagtial Election Result 2023: జగిత్యాలలో బీఆర్‌ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్ విజయం
Jagtial

Updated on: Dec 03, 2023 | 7:19 PM

జగిత్యాల నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థి డా. ఎం. సంజయ్ కుమార్ మరోసారి  15822 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు 70243 ఓట్లు పోలయ్యాయి.  కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి 54421 ఓట్లు పోలవ్వగా.. బీజేపీ అభ్యర్థిని భోగ శ్రావణికి 42138 ఓట్లు పడ్డాయి.

జగిత్యాల నియోజకవర్గం (Jagtial Assembly Election) 1957లో ఏర్పడింది. తెలంగాణ వచ్చాక డివిజన్‌ కేంద్రం కాస్తా 2014లో జిల్లా కేంద్రంగా మారడంతో జగిత్యాల ఎంతో అభివృద్ధి చెందింది. నియెజకవర్గంలో జగిత్యాల మున్సిపాలిటీతోపాటు, జగిత్యాల అర్బన్‌, రూరల్‌, సారంగాపూర్‌, బీర్‌పూర్‌, రాయికల్‌, మండలాలున్నాయి. ఈ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీయే ఎక్కువగా తొమ్మిదిసార్లు గెలుపొందింది. 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసిన డా. ఎం. సంజయ్ కుమార్ 61,185 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.  సంజయ్ కుమార్‌కు 104,247 ఓట్లు పోలవ్వగా.. జీవన్ రెడ్డికి 43,062 ఓట్లు పోలయ్యాయి. మరోసారి సంజయ్ ఇక్కడి నుంచి ఇప్పుడు గెలుపొందారు.

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023 లైవ్

 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్

తెలంగాణ పోలింగ్ ఫలితాల లైవ్ కౌంటింగ్ అప్‌డేట్స్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పార్టీల ఫలితాలు లైవ్