Telangana రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు.. రూ.47 లక్షలు పోగొట్టుకున్న ఐటీ ఉద్యోగి

రాష్ట్రంలో సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త ఎత్తుగడలతో ప్రజల సొమ్మును కాజేస్తున్నారు. అమాయకులతో పాటు వృత్తి నిపుణులు సైతం సైబర్ నేరాల బారిన పడుతుండటం కలవరం రేపుతోంది. తాజాగా టోలిచౌకి కు చెందిన ఓ ఐటీ ఉద్యోగి సైబర్ నెరగాళ్ళ చేతిలో దారుణంగా మోసపోయాడు.

Telangana రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు.. రూ.47 లక్షలు పోగొట్టుకున్న ఐటీ ఉద్యోగి
Cyber Crime

Edited By:

Updated on: Jul 11, 2023 | 3:25 PM

రాష్ట్రంలో సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త ఎత్తుగడలతో ప్రజల సొమ్మును కాజేస్తున్నారు. అమాయకులతో పాటు వృత్తి నిపుణులు సైతం సైబర్ నేరాల బారిన పడుతుండటం కలవరం రేపుతోంది. తాజాగా హైదరాబాద్‌లోని టోలిచౌకి కు చెందిన ఓ ఐటీ ఉద్యోగి సైబర్ నెరగాళ్ళ చేతిలో దారుణంగా మోసపోయాడు. ఒకటి, రెండు కాదు.. ఏకంగా 47 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. తాను మోసపోయాను అని గ్రహించి పోలీసులకు మొర పెట్టుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే బాధితుడికి గత కొద్దిరోజుల క్రితం గెట్ వైరల్ ఇన్ఫర్మేషన్ సిస్టం అనే సంస్థ ద్వారా వాట్సాప్ సందేశం వచ్చింది. నోరా శర్మ అనే ఓ మహిళ పేరుతో HR మేనేజర్ అంటూ అతడికి మెసేజ్ చేసింది. తామచ్చిన టాస్కులు పూర్తి చేస్తే అదనపు ఆదాయం పొందొచ్చన్నది ఆ మెసేజ్ సారాంశం. యూ ట్యూబ్ లో వీడియోస్ కి సబ్స్క్రయిబ్ చేస్తే మని వస్తాయి అని బాధితుడిని నమ్మించారు. తాము పంపిన ఒక్కో యూట్యూబ్ లింక్ ను సబ్‌స్క్రైబ్ చేస్తే 50 రూపాయల చొప్పున ఇస్తామంటూ ఆశ చూపారు.. బాధితుడు అందుకు అంగీకరించడంతో మొదటగా మూడు యూట్యూబ్ లింకులను షేర్ చేశారు. మూడు యూట్యూబ్ లింకులను సబ్‌స్కైబ్ చేసినందుకుగాను బాధితుడికి 150 రూపాయలు జమ అయినట్టు మొబైల్లో చూపించింది .

అలా చూపించిన డబ్బులు కలెక్ట్ చేసుకోవాలంటే టెలిగ్రాం ద్వారా మా సంస్థ రిసెప్షనిస్ట్ సంప్రదించాలని మరో మెసేజ్ వచ్చింది. రిసెప్షనిస్ట్ ను సంప్రదించిన బాధితుడు అనంతరం ఆ డబ్బు అకౌంట్ లో జమ కావాలి అంటే బ్యాంక్ ఖాతా వివరాలు ఇవ్వాలని సూచించింది. దీంతో తన బ్యాంకు ఖాతాలను బాధితుడు టెలిగ్రామ్ ద్వారా సెండ్ చేశాడు..బ్యాంక్ ఖాతా వివరాలు ఇచ్చాకా బాధితుడి ఖాతాలో 150 జమ అయింది. ఇక అప్పటి నుంచి సైబర్ నేరస్తులు తమ ప్లాన్ ను ఎగ్జిక్యూట్ చేయడం మొదలుపెట్టారు. యూట్యూబ్ లింకులతోపాటు తాము చెప్పినచోట పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని బాధితుడిని నమ్మించారు. దీంతో ముందుగా వెయ్యి రూపాయల నుండి 5000 వరకు బాధితుడు పెట్టుబడి పెట్టాడు. తన మొబైల్ యాప్ లో తను పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభం వచ్చినట్టు చూపించడంతో మరికొంత పెట్టుబడి పెట్టాడు. ఐదు వేల వరకు పెట్టుబడికి లాభాలు ఇచ్చారు.. లాభాలు బ్యాంకు ఖాతాలో జమ చేశారు.. అనంతరం పది వేల రూపాయలు పెట్టాడు బాధితుడు. అప్పటి నుండి నేరగాళ్లు లాభాలను బ్యాంక్ లో జమ చేయడం మానేశారు.

కానీ యాప్ లో మాత్రం లాభాలు చూపించారు .. ఆ లాభాలు తీసుకు తీసుకోవాలని మరికొంత పెట్టుబడి పెట్టాలని సూచించారు… ఇలా విడతలవారీగా సుమారుగా 47 లక్షల రూపాయలు బాధితులు పెట్టుబడి పెట్టాడు. తాను పెట్టిన పెట్టుబడికి తిరిగి ఇవ్వాలని కోరడంతో అప్పటినుండి సైబర్ క్రిమినల్స్ స్పందించడం మానేశారు. దీంతో తాను మోసపోయాను అని గ్రహించి బాధితుడు పోలీసులు ఆశ్రయించాడు. మరోవైపు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసులు సూచిస్తున్నారు. అవగాహన లేకపోవడం,అత్యశకు పోయి చాలామంది మోసపోతున్నారన్నారు. సంవత్సరంలో 500 కేసులు ఇలాంటి కేసులే నమోదు అవుతున్నాయనీ.. ఈ కేసులన్నీ కూడా చైనీస్ ఫ్రాడ్ లని తెలిపారు. పార్ట్ టైం జాబ్ ల పేరిట, ఉద్యోగాల పేరిట జనవరి నుండి జులై వరకు 20కోట్ల రూపాయల సైబర్ నేరగాళ్లు దోచుకున్నారని పేర్కొన్నారు. అందుకే సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలనీ, అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే కాల్స్ మెసేజెస్ కు స్పందించవద్దని హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

( రిపోర్టర్: జ్యోతి టీవీ9 )