Telangana Congress: షోకాజ్ నోటీసులపై కోమటిరెడ్డి స్పందిస్తారా? లైట్ తీసుకుంటారా?

|

Oct 24, 2022 | 6:00 AM

అధిష్టానం నోటీసులకు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందిస్తారా? లేదంటే పట్టించుకోకుండా వదిలేస్తారా? సరైన వివరణ రాకపోతే పార్టీ ఎలా ముందుకెళ్లబోతోందనేది..

Telangana Congress: షోకాజ్ నోటీసులపై కోమటిరెడ్డి స్పందిస్తారా? లైట్ తీసుకుంటారా?
Komatireddy Venkat Reddy
Follow us on

అధిష్టానం నోటీసులకు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందిస్తారా? లేదంటే పట్టించుకోకుండా వదిలేస్తారా? సరైన వివరణ రాకపోతే పార్టీ ఎలా ముందుకెళ్లబోతోందనేది ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అవును, తెలంగాణ కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యవహారం.. ఇప్పుడు ఢిల్లీకి చేరింది. సొంత పార్టీపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఆడియో, వీడియో రూపంలో వైరల్‌ కావడంతో.. హైకమాండ్‌ రంగంలోకి దిగింది. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది.

కాంగ్రెస్‌ ఓడిపోతుందంటూ ఇటీవల ఓ కార్యకర్తతో కోమటిరెడ్డి మాట్లాడినట్టుగా ఓ వాయిస్‌ క్లిప్‌ వైరల్‌ కావడంతో చర్యలకు ఉపక్రమించింది ఏఐసీసీ . దీనిపై కోమటిరెడ్డిని వివరణ కోరారు ఏఐసీసీ కార్యదర్శి తారిఖ్‌ అన్వర్‌. అంతే కాకుండా మునుగోడులో బీజేపీ అభ్యర్థి, తన సోదరుడు రాజగోపాల్‌రెడ్డికి ఓటేయాలంటూ.. ఓ కార్యకర్తతో వెంకట్‌రెడ్డి మాట్లాడటం పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన కిందికి వస్తుందనీ.. పార్టీ రాజ్యాంగం ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోకూడదో 10 రోజుల్లో చెప్పాలనీ… నోటీసుల్లో ప్రశ్నించింది ఏఐసీసీ. దీనికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎలా స్పందిస్తారు? సరైన వివరణ ఇవ్వకపోతే ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయనేది ఆసక్తిగా మారింది.

అదంతా ఒకప్పటి మాట..

కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. 2 దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. ఎన్నో పదవులు ఆయనను వరించాయి. కోమటిరెడ్డి అంటే కరడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్త. అయితే ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు ఆయన తీరుపై సొంత పార్టీతో పాటు పక్క పార్టీ కార్యకర్తల్లోనూ చర్చ జరుగుతోంది. వెంకటరెడ్డి తమ్ముడు.. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం.. బీజేపీ నుంచి మునుగోడు బరిలో దిగినప్పటి నుంచి వెంకటరెడ్డి కదలికలు తేడాగా ఉన్నాయి. పేరుకే పార్టీలో ఉన్నా.. ఆయన పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఎన్నికలు జరుగుతున్నా.. కనీసం ప్రచారంలో పాల్గొనలేదు. కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి కోసం పని చేయలేదు. పైగా పార్టీకి డ్యామేజ్ అయ్యేలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇవి అధిష్టానం దృష్టికి వెళ్లడంతో నోటీసులు ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..