
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మహిళలకు పెద్దపీట వేస్తామన్న హై కమాండ్ కార్పొరేషన్ పదవులలో తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు. సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు అవకాశం ఇవ్వాలి లేదంటే న్యాయం పోరాటం చేస్తా అంటూ గాంధీ భవన్ వేదికగా తన ఆక్రోశాన్ని వెళ్లగక్కింది. ఈ నేపద్యంలో సీఎం రేవంత్ రెడ్డి సునీతాని కొంత దూరం పెట్టినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా తన పదవీకాలం ముగిసినా కూడా ఆమెను ఇంకా కొనసాగిస్తున్నప్పటికి నాకు మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు గా కొనసాగించాలి లేదంటే బీసీ మహిళ కోటాలో ఎమ్మెల్సీ పదవిని ఇవ్వాలని పట్టుబడుతుందట.
ఈ నేపథ్యంలో మొన్నటివరకు ఢిల్లీ ఉండి హై కమాండ్ పెద్దలను కలిసి తనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని లాబీయింగ్ చేసి ఫలితం లేక హైదరాబాద్ తిరిగి వచ్చిందని ప్రచారం జరుగుతోంది. దీనితో మహిళలకు కాంగ్రెస్ తగిన ప్రాధాన్యం ఇవ్వక పోతే మంత్రులను నిలదీయాలని గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంచలన కామెంట్స్ చేసింది. రెండు రోజుల క్రితం మహిళ కాంగ్రెస్ కమిటీలు వేసి జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శులను ఇందిరా భవన్ లో ప్రకటించింది.
కానీ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు సమాచారం ఇవ్వకపోవడంతో పీసీసీకి, సునీతా రావుకు గ్యాప్ ఉన్నట్లు అర్ధమవుతుంది. ఈ నేపథ్యంలో సునీతా రావు వ్యవహారం పీసీసీకి అటు హైకమాండ్‌కు తలనొప్పిగా మారిందట. మహిళా కాంగ్రెస్ నేత సునీతా రావు వ్యవహారంను గమనిస్తున్న ఇటు టీ-కాంగ్రెస్, అటు హైకమాండ్ ఏ విధంగా తీసుకుంటుంది. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో సునీతారావుకు ప్రాధాన్యం ఇస్తారా? లేక మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా కొనసాగిస్తారా? ఆమె కామెంట్స్‌ను ఏవిధంగా తీసుకుంటారో చూడాలి.