Musi Flood: ఎడతెరిపిలేని వర్షాలతో మూసీ ఉగ్రరూపం… నదికి భారీగా వరద నీరు.. గేట్లు ఎత్తి దిగువకు..

| Edited By: Ravi Kiran

Sep 06, 2021 | 5:03 PM

అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్‌ నగరంతో పాటు ఎగువ మూసీ పరివాహక ప్రాంతాల్లో నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో...

Musi Flood: ఎడతెరిపిలేని వర్షాలతో మూసీ ఉగ్రరూపం... నదికి భారీగా వరద నీరు.. గేట్లు ఎత్తి దిగువకు..
Musi
Follow us on

ఎడతెరిపిలేని వర్షాలతో మూసీ ఉగ్రరూపం దాలుస్తోంది. నదికి భారీగా వరద చేరింది. మూసీ పోటెత్తుతోంది. ముసారాంబాగ్‌ బ్రిడ్జి వద్ద వరద ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. బ్రిడ్జిని తాకుతూ వరద భారీగా వెళ్తోంది. హిమాయత్‌సాగర్‌ ఇప్పటికే నిండింది. హిమాయత్‌సాగర్‌ నుంచి నీటిని సైతం వదిలారు. వరద భారీగా వస్తుండడంతో బ్రిడ్జి వద్ద ముసారాంబాద్‌ బ్రిడ్జి వద్ద జల పరవళ్లు తొక్కుతోంది. అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్‌ నగరంతో పాటు ఎగువ మూసీ పరివాహక ప్రాంతాల్లో నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో… విస్తారంగా కురుస్తున్న వర్షాలతో నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టుకు ఆదివారం ఇన్‌ఫ్లో పెరిగింది.

శుక్ర, శనివారాల్లో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టి వరద తగ్గిన నేపథ్యంలో శనివారం రాత్రి ప్రాజెక్టు రెండు గేట్లను మూడు అడుగుల మేర ఎత్తి ఐదు వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదలటంతో ప్రాజెక్టు నీటిమట్టం 641.85 అడుగులకు చేరింది. ఆదివారం సాయంత్రానికి ఇన్‌ఫ్లో 13,822క్యూసెక్కులకు పెరగడంతో 2, 4, 11, 7, 10నెంబర్‌ గేట్లను నాలుగు అడుగుల మేర ఎత్తి 12,528 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదిలారు.

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు..

తెలంగాణలో అల్పపీడనం ఎఫెక్ట్‌‌తో గత రెండ్రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా భారీవర్షాలు పడ్డాయి. రికార్డుస్థాయిలో వాన కురిసింది. ఎడతెరిపిలేకుండా కురిసిన వానలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జనజీవనం స్తంభించిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. గత నాలుగైదు రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షం పడటంతో చెరువులు, కుంటలు అలుగు పారుతున్నాయి.

ఇవి కూడా చదవండి: ట్రాఫిక్‌లో హారన్ శబ్ధాలు ఇబ్బంది పెడుతున్నాయా.. ఇక ఆ సౌండ్ పొల్యూషన్‌ వినిపించదు ఎందుకో తెలుసా..

Goat Farming: ఈ మొబైల్ యాప్ మీ దగ్గర ఉంటే చాలు.. మేకల పెంపకంలో లక్షలు సంపాదించడం నేర్పిస్తుంది..