Telangana IT Raids: నల్గొండ జిల్లాలో ఐటీ రైడ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్యెల్యే కుమారులు, బంధువుల ఇళ్లలో సోదాలు
తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆదాయ పన్ను శాఖ అధికారుల సోదాలు కలకలం రేపుతున్నాయి. నిన్ని మొన్నటి వరకు కాంగ్రెస్ నేతల ఇళ్ళల్లో కొనసాగిన తనిఖీలు.. తాజాగా అధికార పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కుమారులు, బంధువులు, అనుచరుల ఇళ్లపై ఏకకాలంలో ఐటీ సోదాలు జరిగాయి. నల్లగొండ జిల్లా అధికార పార్టీ బీఆర్ఎస్ నేతల్లో గుబులు మొదలయింది.

తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆదాయ పన్ను శాఖ అధికారుల సోదాలు కలకలం రేపుతున్నాయి. నిన్ని మొన్నటి వరకు కాంగ్రెస్ నేతల ఇళ్ళల్లో కొనసాగిన తనిఖీలు.. తాజాగా అధికార పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కుమారులు, బంధువులు, అనుచరుల ఇళ్లపై ఏకకాలంలో ఐటీ సోదాలు జరిగాయి.
తెలంగాణలో మరోసారి ఐటీ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఉదయం 4 గంటల నుంచే 40 బృందాలు రంగంలోకి దిగాయి. హైదరాబాద్‌లోని వింజమూరి శ్రీధర్ రావు ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అలాగే మిర్యాలగూఢలోని వైదేహి టౌన్ షిప్ లోను సోదాలు కొనసాగాయి. మిర్యాలగూడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అనుచరుడిగా శ్రీధరరావు పేరుంది. శ్రీధర్ రావు ఇంటితో పాటు భాస్కర్ రావు కుమారులు, వారి బంధువు ఇళ్ళపై దాడి చేశారు ఆదాయ పన్ను శాఖ అధికారులు. హైదరాబాద్, నల్లగొండ, మిర్యాలగూడలో ఏక కాలంలో 40 బృందాలతో సోదాలు నిర్వహించారు.
భాస్కర్ రావు అనుచరుడు వింజమూరి శ్రీధర్ ఇంటిపై ఐటీ అధికారులు దాడి చేశారు. ఆయనతోపాటు భాస్కర్ రావుకు సంబంధించిన వ్యాపారులు రంగా రంజిత్, రంగా శ్రీధర్, బండారు కుశలయ్య నివాసాలలో కూడా ఐటీ అధికారులు విస్తృతంగా తనిఖీలు జరిపారు. నిడమనూరు మండలం శాఖాపురంలోని భాస్కర్ రావు స్వగృహంలో కూడా ఐటీ తనిఖీలు కొనసాగాయి. త్రిపురారం మండలం ముకుందాపురం సాల్వెంట్ ఆయిల్ మిల్లు, నల్లగొండలోని నెహ్రూ గంజ్ లో ఉన్న మహేంద్ర ఆయిల్ మిల్ లో కూడా సోదాలు కొనసాగాయి.
ఎన్నికల కోసం భారీగా డబ్బులు నిల్వ ఉంచారన్న అరోపణలతో ఐటీ అధికారులు అకస్మిక తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. దీంతో నల్లగొండ జిల్లా అధికార పార్టీ బీఆర్ఎస్ నేతల్లో గుబులు మొదలయింది. వైదేహి కన్‌స్ట్రక్షన్ పేరుతో నల్లమోతు భాస్కరరావు అనుచరులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ.. పెద్ద ఎత్తున సొత్తును దాచిపెట్టారని ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. ఎన్నికల ఖర్చు కోసం నగదు అంతా ఇప్పటికే నియోజవర్గాలకు చేరిందని తెలుసుకున్న ఆదాయపు పన్ను శాఖ అధికారులు ప్రతి నియోజకవర్గం పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. దీనిపై సమాచారం అందిన వెంటనే ఐటీ అధికారులు వారి ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేశారు. ఇక నుంచి ప్రతి రోజు తెలంగాణ వ్యాప్తంగా దాడులు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకున్నట్లు సమాచారం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…