Cyber Attack: రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు.. 40 పైసలకు 6 లక్షలు అంటూ భారీ ఝలక్..

|

Jan 04, 2022 | 9:17 AM

Cyber Attack: తెలంగాణలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లాలో రుణం పేరుతో ఓ వ్యక్తికి రూ. 2 లక్షలకు పైగా కుచ్చుటోపి పెట్టారు. మోస పోయిన విషయాన్ని గ్రహించిన

Cyber Attack: రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు.. 40 పైసలకు 6 లక్షలు అంటూ భారీ ఝలక్..
Follow us on

Cyber Attack: తెలంగాణలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లాలో రుణం పేరుతో ఓ వ్యక్తికి రూ. 2 లక్షలకు పైగా కుచ్చుటోపి పెట్టారు. మోస పోయిన విషయాన్ని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని సదాశివనగర్ మండలం కుప్రీయాల్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి రూ. 6 లక్షలు రుణాన్ని 40 పైసలు వడ్డీకే మంజూరు అయిందని సైబర్ నేరగాళ్ల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దానిని విశ్వసించిన బాధితుడు.. వారు చెప్పినట్లు చేశాడు. ట్యాక్స్, జీఎస్టీ పేరిట ముందస్తుగా ఫోన్ పే ద్వారా 62,000 రూపాయలు చెల్లించాడు బాధితుడు. ఆ తరువాత వివిధ రుసుముల పేరిట 1,73,000 రూపాయలు చెల్లించాడు. మొత్తంగా 2,35,000 రూపాయలు చెల్లించిన తరువాత రుణం డబ్బుల కొరకు ఫోన్ చేయగా కేటుగాళ్ల ఫోన్ స్విచాఫ్ అని వచ్చింది. ఎన్నిసార్లు ప్రయత్నించినా అదే రెస్పాండ్స్ రావడంతో బాధితుడు తాను మోసపోయినట్లు గ్రహించాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌తో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు పోలీసులు సూచిస్తున్నారు.

Also read:

Arvind Kejriwal Corona Positive: అరవింద్ కేజ్రీవాల్‌కు కరోనా పాజిటివ్.. ట్విట్టర్ ద్వారా వెల్లడించిన ఢిల్లీ సీఎం..

స్మశానంలో బంగారం దాచిన దొంగలు !! ట్విస్ట్‌ ఏంటంటే ?? వీడియో

News Watch: ఒమిక్రాన్ ని పక్కన పెట్టండి.. కరోనా సంగతేంటి… మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్