Rain Alert: కొనసాగుతున్న అల్పపీడనం.. తెలంగాణలోని ఆ జిల్లాలకు వర్ష సూచన.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..

|

Jun 27, 2023 | 9:17 AM

Telangana Rains: నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా విస్తరించాయి. దీంతో ఏపీ సహా.. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది.

Rain Alert: కొనసాగుతున్న అల్పపీడనం.. తెలంగాణలోని ఆ జిల్లాలకు వర్ష సూచన.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..
Telangana Rains
Follow us on

Telangana Rains: నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా విస్తరించాయి. దీంతో ఏపీ సహా.. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఉత్తర ఒడిశా, దక్షిణ ఝార్ఖండ్‌, ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ పరిసరాల్లో అల్పపీడనం కొనసాగుతోందని.. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సహా.. ఉత్తర తెలంగాణలో మంగళవారం వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆదిలాబాద్‌, కుమ్రం భీం ఆసిఫాబాద్‌, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, నిర్మల్‌, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, వరంగల్ జిల్లాల్లో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఇక, హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో, హైదరాబాద్ నగరంలోని పలు చోట్ల సోమవారం వర్షం కురిసింది. రాష్ట్రంలో అత్యధికంగా కుమ్రం భీం జిల్లా సిర్పూర్‌(టీ)లో 7 సెం.మీ వర్షపాతం నమోదయినట్లు అధికారులు తెలిపారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ లో 6 సెం.మీ, బెజ్జూర్‌లో 5 సెం.మీ, నిర్మల్‌ జిల్లా ముథోల్‌లో 5 సెం.మీ, కామారెడ్డి ఎల్లారెడ్డిలో 4 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

కాగా.. అటు ఏపీలో సైతం పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..