
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్‌ఐటీలో విషాదం చోటుచేసుకుంది. పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న వడ్ల దీపిక అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. సంగారెడ్డి జిల్లా గొర్రెకల్‌కు చెందిన దీపిక విద్యార్థులతో కలిసి వార్షిక పరీక్షలు రాసింది. ఆ తర్వాత బాత్రుంకి వెళ్లాస్తానంటూ వెళ్లింది. కానీ చాలా సేపటి వరకు ఆమె తిరిగిరాలేదు. దీంతో అక్కడున్న భద్రతా సిబ్బందికి అనుమానమచ్చింది. వెంటనే వెళ్లి చూడగా దీపిక చున్నీతో ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెకు ముందుగా క్యాంపస్ హెల్త్ సెంటర్‌లో ప్రథమ చికిత్స చేశారు. అనంతరం భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే విద్యార్థిని మృతి చెందినట్లు ఏరియా ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
దీపిక ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె తల్లిదండ్రులకు ట్రిపుల్‌ఐటీ అధికారులు తెలియజేశారు. అయితే ఓ వైపు వార్షిక పరీక్షలు జరుగుతుండగా దీపిక ఆత్మహత్య చేసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మహత్య ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. దీపిక సూసైడ్‌కు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.