TGSRTC: కండెక్టర్‌ వద్ద చిల్లర మర్చిపోయారా? డోంట్ వర్రీ.. ఫోన్ పే చేస్తారు

ఆర్టీసీ అంటేనే క్షేమంగా గమ్యస్థానాలకు తీసుకెళ్తుంది అని ప్రజలకు ఓ నమ్మకం. అంతేకాదు... టికెట్ ధరలు ప్రైవేట్ ట్రావెల్స్‌తో పోల్చితే చాలు తక్కువగా ఉంటాయ్.. ప్రయాణంలో ఏదైనా సమస్య వచ్చినా జవాబుదారీతనం ఉంటుంది. అయితే ఆర్టీసీ చాలా సర్వీసులు అందిస్తుంది కానీ వాటి గురించి ప్రజలకు అవగాహన లేదు.. వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం....

TGSRTC: కండెక్టర్‌ వద్ద చిల్లర మర్చిపోయారా? డోంట్ వర్రీ.. ఫోన్ పే చేస్తారు
Telangana RTC Bus

Edited By:

Updated on: Feb 27, 2025 | 1:28 PM

‘ఆర్టీసీ ప్రయాణం.. సురక్షితం, శుభప్రదం’ అని చాలామంది ప్రయాణీకులు భావిస్తారు. ఎందుకంటే సిబ్బందికి పక్కా ట్రైనింగ్ ఇచ్చి సర్వీసులోకి తీసుకుంటారు. దీంతో ప్రయాణీకులను వారు క్షేమంగా గమ్య స్థానాలకు చేర్చుతారు. ఇక ప్రవేట్ ట్రావెల్స్ కంటే టికెట్ రేట్లు చాలా చౌకగా ఉంటాయి. ఇక ఆర్టీసీ పలు రకాల ఆఫర్స్ కూడా అందుబాటులోకి తెస్తూ ప్రయాణీకులను ఆకర్షిస్తూ ఉంటుంది. అయితే బస్సులో ట్రావెల్ చేసేటప్పుడు చాలామంది టికెట్ కోసం రూ.100, రూ.200, రూ.500 వంటి నోట్లు ఇస్తూ ఉంటారు. కండెక్టర్ వద్ద కూడా ఆ సమయానికి చిల్లర లేకపోవడంతో.. టికెట్ వెకన అమౌంట్ రాసి.. దిగేటప్పుడు ఇస్తామంటారు.

దీంతో కొంతమందికి ఆ చిల్లర తీసుకునేవరకు నిమ్మళం ఉండదు. కండెక్టర్ వద్ద ఏదో తమ ఆస్తి ఉన్నట్లు ఫీలవుతారు. ఆ టికెట్ పోతే డబ్బులు పోతాయని.. దాన్ని జాగ్రత్తగా దాచిపెడుతూ ఉంటారు. అయితే కొందరు మాత్రం స్టాఫ్ వచ్చినప్పుడు హడావిడిగా దిగిపోయి చిల్లర ఇవ్వాల్సిన విషయం మర్చిపోతూ ఉంటారు. బస్సు వెళ్లపోయాక గుర్తొచ్చి.. అయ్యో ఇలా జరిగింది ఏంటి.. డబ్బులు పోయాయ్ అని బాధపడుతూ ఉంటారు. ఇకపై ఇలాంటి చింత మీకు అక్కర్లేదు.

ఇలా కండెక్టర్ వద్ద చిల్లర మర్చిపోయినా, వస్తువులు ఏవైనా RTC బస్సులో మిస్ చేసినా.. మీకు ఇచ్చే టికెట్‌పై ఉన్న హెల్ప్​ లైన్ నెంబరు 040-69440000కు కాల్ చేస్తే… తిరిగి మీకు రావాల్సిన చిల్లర గురించి రూడీ చేసుకుని.. ఆ సొమ్మును ఫోన్ పే ద్వారా పంపుతారు. అలాగే ప్రయాణం చేసేటప్పుడు ఆర్టీసీ బస్సులో ఏవైనా మర్చిపోయినా హెల్ప్‌లైన్‌ నెంబరు ద్వారా తిరిగి పొందవచ్చు. అంతేకాదండోయ్.. బస్సు ఎక్కడైనా హాల్ట్ కోసం ఆగి మీరు ఎక్కకుండానే వెళ్లిపోతే… ఆ నెంబర్‌కే ఫోన్‌ చేస్తే… అదే టికెట్‌పై మరొక బస్సులో గమ్యస్థానానికి చేరవేస్తారు. అందుకే ఎప్పుడైనా మీకు ఇలాంటి సమస్యలు ఎదురైతే ఆహెల్ప్​లైన్​ నంబర్​కు ఫోన్ చేసి సహాయం పొందండి.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి