AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరీ ఇంత చిన్న మిస్టేకా.? అదే ఐబొమ్మ రవిని పట్టించింది.. విచారణలో షాకింగ్ నిజాలు

ఐబొమ్మ రవి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు ఏడు రోజుల కస్టడీ కోరారు. దీనికి సంబంధించి నాంపల్లి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా.. విచారణ జరుగుతోంది. మరోవైపు.. నాంపల్లి కోర్టులో ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్‌ దాఖలు చేయడంతో..

మరీ ఇంత చిన్న మిస్టేకా.? అదే ఐబొమ్మ రవిని పట్టించింది.. విచారణలో షాకింగ్ నిజాలు
Ibomma Ravi
Ravi Kiran
|

Updated on: Nov 18, 2025 | 7:24 PM

Share

ఐబొమ్మ రవి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు ఏడు రోజుల కస్టడీ కోరారు. దీనికి సంబంధించి నాంపల్లి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా.. విచారణ జరుగుతోంది. మరోవైపు.. నాంపల్లి కోర్టులో ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్‌ దాఖలు చేయడంతో.. వాదనలు విచారణ జరగాయి.

ఇదిలావుంటే.. ఐబొమ్మ రవి కేసులో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. కేసు వివరాలు ఇవ్వాలంటూ హైదరాబాద్‌ సీపీకి ఈడీ లేఖ రాసింది. ఇప్పటికే ఐబొమ్మ రవి అకౌంట్‌లోని మూడున్నర కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు. అయితే.. విదేశీ అకౌంట్ల నుంచి రవి ఖాతాలోకి భారీగా నిధులు రావడంతో మనీలాండరింగ్ జరిగినట్టు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు.

ఇక.. ఈ నెల 14న ఐబొమ్మ రవిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ పోలీసులకు సవాల్‌గా మారిన ఐ-బొమ్మపై కొన్నాళ్లుగా ఫోకస్‌ పెట్టారు. ఈ క్రమంలో.. ఇటీవల ఓ బెట్టింగ్ యాప్ నుంచి ఐబొమ్మ రవి నగదు స్వీకరించినట్లు గుర్తించి.. ఆ దిశగా దర్యాప్తు చేశారు. డు. దీని ఐపీ అడ్రస్ మూసాపేటలోని విస్టా అపార్ట్‌మెంట్స్‌లో ఉన్నట్లు తేలింది. దీనికి సంబంధించి విచారణ జరుగుతున్న సమయంలోనే ఐబొమ్మ రవి ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్‌ రావడంతో అతన్ని అరెస్ట్‌ చేసి.. కటకటాల్లోకి నెట్టారు. ఇక… బెట్టింగ్ యాప్‌ల ద్వారా ఎంత సంపాదించాడు?.. ఏ ఏ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాడు?.. అనే అంశాలపై హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.

Follow Us