
తన జన్మదినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ (IAS) మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్పూర్తిగా తీసుకొని ఆమె మొక్కలు నాటారు. తాను నాటిన మొక్కలు బ్రతికి భూమిపై పచ్చదనాన్ని ఇవ్వాలని కోరుకున్నట్లు ఆమె తెలిపారు. స్మితా సబర్వాల్ పుట్టినరోజు పురస్కరించుకొని ఆమెపై ఉన్న అభిమానంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు మొక్కలు నాటి సోషల్ మీడియా వేదికగా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. డైనమిక్ ఆఫీసర్‌గా స్మితా సబర్వాల్‌కు పేరున్న విషయం తెలిసిందే.
Sinking my roots ? into the Earth !
Thankyou @MPsantoshtrs
for #greenindiachallenge pic.twitter.com/DoRSJQhZqD— Smita Sabharwal (@SmitaSabharwal) June 19, 2021
కాగా పచ్చదనం పట్ట ప్రత్యేక శ్రద్ద కనబరుస్తున్న తెలంగాణ రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల లేఖ రాసిన విషయం తెలిసిందే. దేశంలో పచ్చదనం పెంచడం కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి ఎంపీ సంతోష్ పురుడు పోశారు. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో సీనీ, రాజకీయ ప్రముఖులతో పాటు.. వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. వారు మొక్కలు నాటడంతో పాటు… మరికొందరికి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అయితే దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం సక్సెస్ కావడంతో ప్రధాని మోదీ సంతోష్ కుమార్‌ను ప్రశంసించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ సంతోష్ కుమార్ కు ప్రధాని మోదీ లేఖ రాశారు. పచ్చదనం దిశగా యువత ముందుకు వెళ్లాలని ప్రధాని పేర్కొన్నారు.
Also Read: విందు కార్యక్రమంలో వధువు అల్లరి.. అందరూ ఫిదా