సివిల్ సర్వీస్‌లో విజయం సాధించాలని చాలా మంది ఆశయంతో ఉంటారు. అందుకోసం రాత్రనక, పగలనక కష్టపడుతుంటారు. అయితే సరైన శిక్షణ లేని కారణంగా వెనకబడుతుంటారు. అలా ప్రతిభ ఉండి, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోనే వారి కోసమే ప్రముఖ కోచింగ్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ తక్షశిల ఐఏఎస్ అకాడమీ సదవకాశాన్ని కల్పించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో.. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఇంటర్ ఫ్లస్ ఐఏఎస్, డిగ్రీ ఫన్ ఐఎఎస్ కోసం ఉచితంగా కోచింగ్ అందించడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తక్షశిల ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బి.ఎస్. ఎస్. ప్రసాద్ తెలిపారు.
ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను మాజీ ఐఏఎస్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ ఆదివారం పోస్టర్‌ను ఆవిష్కరించారు. తక్షశిల మెరిట్ అడ్మిషన్ టెస్ట్ పేరుతో ట్యాలెంట్ టెస్ట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తక్షశిల ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బి.ఎస్.ఎన్. ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య వారి లక్ష్యాలను సాధించడానికి సమాన అవకాశాలు ఉండాలని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రవేశ పరీక్షలో మొదటి పది ర్యాంకులు సాధించిన వారికి డిగ్రీ ప్లస్ ఐఎఎస్ 3 సంవత్సరాల ఉచిత కోచింగ్, పరీక్షలో 80 శాతం పై మార్కులు వచ్చిన వారిని ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుందన్నారు. 10వ తరగతి చదువుతున్న వారు ఇంటర్ ప్లస్ ఐఏఎస్ 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుకు అర్హులని, 12వ తరగతి చదువుతున్న వారు డిగ్రీ ప్లస్ ఐఎఎస్ 3 సంవత్సరాలు ఇంటిగ్రేటెడ్ కోర్సుకు అర్హులని తెలిపారు.
అర్హులైన విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, దేశానికి సేవ చేయాలనే వారి కలలను సాధించడానికి కృషి చేయాలన్నారు. విద్యార్థులు తమ దరఖాస్తులను ఏప్రిల్ 5, 2023 లోపు సమర్పించాలని, అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న విద్యార్థులందరికీ అవకాశం అందుబాటులో ఉంటుందని వివరించారు. మరిన్ని వివరాల కోసం విద్యార్థులు అకాడమీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..