MLC Kavitha: నా ఫోన్‌లను అందుకే సమర్పిస్తున్నా.. ఈడీ అధికారికి ఎమ్మెల్సీ కవిత సంచలన లేఖ.

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు మూడోసారి హాజరయ్యారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకి ఈడీ ఆఫీసులోకి వెళ్లారు కవిత. అయితే అంతకు ముందు సీఎం కేసీఆర్‌ ఇంటి నుంచి ఈడీ కార్యాలయానికి బయలు దేరిన కవిత..

MLC Kavitha: నా ఫోన్‌లను అందుకే సమర్పిస్తున్నా.. ఈడీ అధికారికి ఎమ్మెల్సీ కవిత సంచలన లేఖ.
Brs Mlc Kavitha
Follow us

|

Updated on: Mar 21, 2023 | 1:45 PM

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు మూడోసారి హాజరయ్యారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకి ఈడీ ఆఫీసులోకి వెళ్లారు కవిత. అయితే అంతకు ముందు సీఎం కేసీఆర్‌ ఇంటి నుంచి ఈడీ కార్యాలయానికి బయలు దేరిన కవిత.. కారులోంచి పైకి వచ్చిన తన ఫోన్లను మీడియాకు ప్రదర్శించారు. కవిత తన ఫోన్‌లను ధ్వంసం చేశారన్న ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆ ఫోన్లను తీసుకురావాలని ఈడీ అధికారులు కోరడంతో.. ఆమె ఈ ఫోన్లను తీసుకెళ్లారని తెలిసింది. ఇదిలా ఉంటే ఈడీ కార్యాలయంలోకి కవిత వెళ్లగానే ఆమె రాసిన లేఖ ఒకటి సంచలనంగా మారింది.

ఈడీ దర్యాప్తు అధికారి జోగేంద్రకు కల్వకుంట్ల కవిత లేఖ రాశారు. ఫోన్ల ధ్వంసం ఆరోపణ చేయడాన్ని కల్వకుంట్ల కవిత తీవ్రంగా తప్పుపట్టారు. దురుద్దేశ పూర్వకంగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా నేను గతంలో వాడిన ఫోన్లను సమర్పిస్తున్నానని కవిత లేఖలో పేర్కొన్నారు. ఒక మహిళ ఫోన్‌ను స్వాధీనం చేసుకోవడం గోప్యత హక్కుకు భంగం కలగదా.? అని ఆమె ప్రశ్నించారు. ‘దుర్బుద్ధితో వ్యవహరిస్తున్న దర్యాప్తు సంస్థ నేను ఫోన్‌లను ధ్వంసం చేశానని పేర్కొంది. నన్ను కనీసం సమన్ చేయకుండా లేదా అడగకుండానే ఏ పరిస్థితుల్లో ఎందుకు దర్యాప్తు సంస్థ ఈ ఆరోపణలు చేసింది’ అని కవిత లేఖలో ప్రస్తావించారు.

‘నన్ను తొలిసారిగా మార్చి నెలలో విచారణ కోసం ఈడీ పిలిచింది. కానీ గత ఏడాది నవంబరులోనే ఫోన్లు ధ్వంసం చేశానని ఈడీ ఆరోపించడం అంటే దురుద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేయడమే. తప్పుడు ఆరోపణను ఉద్దేశపూర్వకంగా లీకేజీ ఇవ్వడం వల్ల నా రాజకీయ ప్రత్యర్థులు నన్ను ప్రజల్లో నిందిస్తున్నారు. తద్వారా నా ప్రతిష్టకు తీవ్ర భంగం కలగడమే కాకుండా నా పరువును, మా పార్టీ ప్రతిష్టను ప్రజల్లో తగ్గించే ప్రయత్నం జరిగింది. రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఈడీ వంటి దర్యాప్తు సంస్థ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్న విధిని తొక్కిపెట్టి వ్యవహరించడం దురదృష్టకరం’ అని కవిత పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..