Telangana Collectors: తెలంగాణ సర్కార్ కీలక ఉత్తర్వులు.. హైదరాబాద్ కలెక్టర్‌గా ఎల్. శర్మన్..

Telangana Collectors: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ సహా పలు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసింది. ఈ మేరకు బుధవారం నాడు

Telangana Collectors: తెలంగాణ సర్కార్ కీలక ఉత్తర్వులు.. హైదరాబాద్ కలెక్టర్‌గా ఎల్. శర్మన్..
August

Edited By: Ravi Kiran

Updated on: Aug 12, 2021 | 8:37 AM

Telangana Collectors: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ సహా పలు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసింది. ఈ మేరకు బుధవారం నాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు హైదరాబాద్‌ కలెక్టర్‌గా ఉన్న శ్వేత మహంతి స్థానంలో ఎల్. శర్మన్‌ను ప్రభుత్వం నియమించింది. నాగర్ కర్నూల్ అడిషనల్ కలెక్టర్‌గా ఉన్న మను చౌదరికి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు. ఇక మెదక్ జిల్లా కలెక్టర్ ఎస్ హరీశ్‌కు మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్‌గా అదనపుు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు జీవో విడుదల చేశారు.

కాగా, హైదరాబాద్ కలెక్టర్‌గా ఉన్న శ్వేతా మహంతి.. హార్వర్డ్ యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదువుకునేందుకు ప్రభుత్వాన్ని రిలీవ్ కోరారు. ఆమె కోరిక మేరకు ప్రభుత్వం రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ కలెక్టర్‌గా నియమితులైన ఎల్. శర్మన్.. నాగర్ కర్నూల్ కలెక్టర్‌గా ఉన్నారు. తాజాగా ఉత్తర్వులతో ఆయన హైదరాబాద్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.

Also read:

AP Congress: ఏపీ కాంగ్రెస్ పెద్దలతో హస్తినలో అధిష్టానం పూర్తి స్థాయి చర్చలు.. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం దిశగా మార్గదర్శకాలు

Vegetables Cleaning: కూరగాయలను సబ్బుతో శుభ్రం చేస్తున్నారా..? అయితే ప్రమాదమే.. మరి ఎలా క్లీన్‌ చేయాలి..?

Hiring trends 2021: ఉద్యోగం విష‌యంలో యువ‌త ఆలోచ‌నల్లో స్ప‌ష్ట‌మైన మార్పు క‌నిపిస్తోంది.. హెడ్‌వే కో ఫౌండ‌ర్ వ్యాఖ్య‌లు.