Hydroponic System: నీరు ఉంటే చాలు భూమితో పనే లేదు.. పంటల సాగులో నయా విప్లవం.. విస్తరిస్తున్న హైడ్రోఫోనిక్స్ వ్యవసాయం..

|

Nov 26, 2022 | 1:19 PM

మొక్కలు పెంచాలంటే సాగునీటితో పాటు భూమి లేదా మట్టి ఉండాల్సిందే. మందు కొట్టాల్సిందే. కానీ ఇప్పుడు ఇవేం అవసరమే లేదు. కేవలం నీటి సరఫరా ఉంటే చాలు. పంటలు పుష్కలంగా పండించుకోవచ్చు.

Hydroponic System: నీరు ఉంటే చాలు భూమితో పనే లేదు.. పంటల సాగులో నయా విప్లవం.. విస్తరిస్తున్న హైడ్రోఫోనిక్స్ వ్యవసాయం..
Hydroponic System
Follow us on

మొక్కలు పెంచాలంటే సాగునీటితో పాటు భూమి లేదా మట్టి ఉండాల్సిందే. మందు కొట్టాల్సిందే. కానీ ఇప్పుడు ఇవేం అవసరమే లేదు. కేవలం నీటి సరఫరా ఉంటే చాలు. పంటలు పుష్కలంగా పండించుకోవచ్చు. అదే హైడ్రోపోనిక్స్‌ వ్యవసాయం. డాబా మీద పెంచుకునే ఈ పంట వైపు చాలా మంది మొగ్గు చూపుతున్నారు. మిద్దె తోటల సాగుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. సేంద్రీయ పద్దతిలో ఆరోగ్య పంటల సాగు వేగంగా విస్తరిస్తుంది. బాల్కనీల్లో, మిద్దెల మీద ఆకుకూరలు, కూరగాయలు, స్ట్రాబెర్రీ, పచ్చిమిర్చిలను రసాయన ఎరువులు వాడకుండా సాగుచేస్తున్నారు.

రెండేళ్లుగా ఈ కల్చర్‌ బాగా పెరిగింది. ఇదే క్రమంలో జడ్చర్లలో హైడ్రోఫోనిక్స్‌ వ్యవసాయం ప్రారంభమైంది. శివకుమార్‌ అనే రైతు మట్టి అవసరం లేకుండా తక్కువ నీటితో తోటల సాగు మొదలు పెట్టాడు. 15 వందలకు పైగా మొక్కల పెంపకం చేపట్టాడు. తగిన ఉష్ణోగ్రత అందేలా గ్రీన్‌షెడ్డ్‌ ఏర్పాటు చేశారు. పెద్ద పెద్ద ఫ్రేములు తయారుచేసి వాటిలో పీవీసీ పైపులు అమర్చి అందులో నీటి సరఫరా అయ్యేలా చేశారు. పెరట్లో తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెంచేలా ఓక దానిపై ఒకటి పైపులు అమర్చారు.

ఆ పైపులకు వరుసగా రంద్రాలు చేసి, క్లేబాల్స్‌ వేశారు. ఈ క్లేబాల్స్‌ మధ్యలో మొక్కలను నాటారు. ఆ మొక్క ఉన్న బుట్ట పూర్తిగా నీటిలో ఉంటుంది. ఆ నీటిలోనే మొక్కలు పెరుగుతున్నాయి. భూమి మీద కంటే నీటిలోనే మొక్కలు వేగంగా ఎదుగుతున్నాయని, దీని వల్ల ఖర్చు తగ్గడంతో పాటు శ్రమ కూడ తగ్గుతోందని అంటున్నారు రైతు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..