AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raja Singh: ఎమ్మెల్యే రాజా సింగ్‌ను పదేళ్లుగా బెదిరిస్తున్న యువకుడు ఇతడే..!

భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు తరచూ బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్న విషయం తెలిసిందే..! 2014 నుండి గోషామహల్ ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్ కు అనేకసార్లు ఇతర దేశాల నుండి బెదిరింపు కాల్స్ వచ్చేవి. సంబంధం లేని నెంబర్లు, సంబంధం లేని వ్యక్తులు పదేపదే ఫోన్లు చేసి తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని పలుమార్లు రాజాసింగ్ హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Raja Singh: ఎమ్మెల్యే రాజా సింగ్‌ను పదేళ్లుగా బెదిరిస్తున్న యువకుడు ఇతడే..!
Rajasingh
Vijay Saatha
| Edited By: |

Updated on: Jun 11, 2024 | 9:55 PM

Share

భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు తరచూ బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్న విషయం తెలిసిందే..! 2014 నుండి గోషామహల్ ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్ కు అనేకసార్లు ఇతర దేశాల నుండి బెదిరింపు కాల్స్ వచ్చేవి. సంబంధం లేని నెంబర్లు, సంబంధం లేని వ్యక్తులు పదేపదే ఫోన్లు చేసి తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని పలుమార్లు రాజాసింగ్ హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల ఎన్నికల సమయంలోనూ రాజాసింగ్ కు బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపులకు పాల్పడ్డ వ్యక్తిని ట్రేస్ చేసేందుకు పోలీసులు అనేక ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు రాజాసింగ్ కు ఫోన్ చేస్తున్న వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు గుర్తించారు.

హైదరాబాద్ పాతబస్తీకి చెందిన వసీంగా గుర్తించారు పోలీసులు. ఉద్యోగరీత్యా దుబాయ్ లో స్థిరపడ్డాడు వసీం. రాజా సింగ్ ఫిర్యాదు తర్వాత ఆ ఫోన్ నెంబర్లను ఆధారంగా చేసుకుని సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా బెదింపు కాల్స్ వస్తున్న నంబర్ దుబాయ్ నుండి ఆపరేట్ అవుతున్నట్లు గుర్తించారు. అతడి లొకేషన్ ఆధారంగా వివరాలను ఆరా తీశారు హైదరాబాద్ పోలీసులు. మహమ్మద్ వసిం దుబాయ్‌లో ఉంటూ రాజాసింగ్‌కు పదే పదే ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడ్డట్టు పోలీసలు నిర్ధారించారు. ఒక ఫోన్ నెంబర్ తో కాకుండా దాదాపు పదికి పైగా ఫోన్ నెంబర్లను మారుస్తూ ఉపయోగించినట్టు తేలింది. నిరంతరం రాజాసింగ్ కు బెదిరింపు కాల్స్ చేసి వేధింపులకు గురి చేశాడు వసీం. ఈ వ్యవహారంపై పోలీసులకు రాజాసింగ్ ఫిర్యాదు పలు మార్లు ఫిర్యాదు చేశాడు.. దీంతో వసీంను అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ పోలీసులు.

వసీం ఎలా పోలీసులకు ఎలా చిక్కాడు..?

దుబాయ్ లో ఉంటున్న వసీంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు హైదరాబాద్ పోలీసులు. వసీం పై గతంలోనే లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అతడు ఎప్పుడు ఇండియా వచ్చిన పోలీసులకు వెళ్లే విధంగా హైదరాబాద్ పోలీసులు చర్యలు చేపట్టడంతో ఎట్టకేలకి వసీంను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లుకౌట్ నోటీసుల కారణంగా దుబాయ్ నుండి హైదరాబాద్‌కు వచ్చిన వెంటనే శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం అందించారు. వసీంను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత పది సంవత్సరాలుగా ఒక వర్గానికి వ్యతిరేకంగా రాజాసింగ్ వ్యాఖ్యలు చేస్తున్నారని అందుకోసమే రాజాసింగ్ కు బెదిరింపు కాల్స్ చేసేవాడినని పోలీసులు విచారణలో వసీం ఒప్పుకున్నట్టు సమాచారం.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…