యాదాద్రిలో సారు బొమ్మ.. తప్పులేదన్న కిషన్ రావు!
తెలంగాణ ప్రాంతంలో కొలువై ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని రాతి స్తంభాలపై సారూ.. కారు.. సర్కారు బొమ్మలను చిత్రీకరించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఆలయ శిలలపై కేసీఆర్ బొమ్మలేంటని విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఈ వివాదంపై ఆలయ అధికారులు స్పందించారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని ఈ బొమ్మలను చెక్కినట్లు యాదాద్రి ఆలయ ప్రత్యేకాధికారి కిషన్ రావు వివరణ ఇచ్చారు. ఏ ఆలయంలోనైనా అప్పటి పరిస్థితులు ప్రతిబింబించేలా బొమ్మలు చెక్కడం ఆనవాయితీ […]
తెలంగాణ ప్రాంతంలో కొలువై ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని రాతి స్తంభాలపై సారూ.. కారు.. సర్కారు బొమ్మలను చిత్రీకరించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఆలయ శిలలపై కేసీఆర్ బొమ్మలేంటని విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఈ వివాదంపై ఆలయ అధికారులు స్పందించారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని ఈ బొమ్మలను చెక్కినట్లు యాదాద్రి ఆలయ ప్రత్యేకాధికారి కిషన్ రావు వివరణ ఇచ్చారు.
ఏ ఆలయంలోనైనా అప్పటి పరిస్థితులు ప్రతిబింబించేలా బొమ్మలు చెక్కడం ఆనవాయితీ అని అన్నారు. అహోబిలంలోనూ గాంధీ, నెహ్రూ బొమ్మలున్నాయని కిషన్ రావు స్పష్టం చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన రాతి స్తంభాలపై కారు మాత్రమే కాదని.. సైకిల్, ఎడ్లబండి, నాగలి బొమ్మలతో కలిపి 5 వేల శిల్పాలుంటాయని అన్నారు. సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన బొమ్మలను చెక్కారని.. ప్రభుత్వం ఓ యజ్ఞంలా ఈ ఆలయాన్ని నిర్మిస్తోందన్నారు. సీఎం కేసీఆర్ బొమ్మను చెక్కమని తమకు ఎవరు చెప్పలేదని.. ఒకవేళ అభ్యంతరం అయితే మార్పులు చేస్తామని చెప్పుకొచ్చారు. ఒకరి కోసం చెక్కిన బొమ్మలు కావని తెలిపిన కిషన్ రావు.. సీఎం కేసీఆర్ కోసమే చెక్కించామని అనడం సరికాదని చెప్పారు.