Hyderabad: బర్త్ డే దావత్ బ్రతుకులను ఛిద్రం చేసింది.. ఇద్దరు మృతి

|

Jul 16, 2021 | 12:31 PM

తాగిన మైకం.. ఈత సరదా.. ఇద్దర్ని పొట్టనబెట్టుకుంది. హైదరాబాద్‌ శామీర్‌పేటలో జరిగిందీ విషాద ఘటన.

Hyderabad: బర్త్ డే దావత్ బ్రతుకులను ఛిద్రం చేసింది.. ఇద్దరు మృతి
Youth Drown In River]
Follow us on

తాగిన మైకం.. ఈత సరదా.. ఇద్దర్ని పొట్టనబెట్టుకుంది. హైదరాబాద్‌ శామీర్‌పేటలో జరిగిందీ విషాద ఘటన.  మొత్తం 8మంది యువకులు. బర్త్ డే వేడుకకు హాజరయ్యారు. కేక్ కటింగ్‌ అయ్యాక దావత్ చేసుకున్నారు. మద్యం మత్తులో మునిగిపోయారు. ఆడారు పాడారు. విజువల్స్‌ అన్ని సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేశారు. ఆ తర్వాత సరదాగా శామీర్‌పేట చెరువులో ఈతకు దిగారు. ఈ క్రమంలోనే ఇద్దరు కనిపించకుండాపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకుని యువకుల కోసం గాలింపు చేపట్టారు.  గజ ఈతగాళ్ళ సాయంతో ఇద్దరి డెడ్‌బాడీలను స్వాధీనం చేసుకున్నారు. మద్యం మత్తులోనే చెరువులోకి దిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

పూర్తి వివరాలు ఇవి….

బొల్లారం, అల్వాల్‌కు చెందిన ఎనిమిదిమంది ఫ్రెండ్స్ ఇంటర్‌ పూర్తి చేసుకుని డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లో ఇటీవలే చేరారు. గురువారం వారిలోని అభిషేక్‌ అనే వ్యక్తి పుట్టినరోజు కావడంతో స్నేహితులందరూ కలిసి బైక్స్‌పై శామీర్‌పేట పెద్ద చెరువు వద్దకు చేరుకున్నారు. కట్టమైసమ్మ దైవదర్శనం చేసుకుని కేక్‌ కట్‌ చేసి ఫ్రెండ్ అభిషేక్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మద్యం సేవించారు. ఈ మత్తులో చెరువులోకి ఈతకు వెళ్లారు. ఈ క్రమంలో శివ, శోభిత్‌ అనే ఇద్దరు మునిగిపోయారు. ఇది గమనించిన తోటి మిత్రులు వారిని రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. శామీర్‌పేట ఎస్‌ఐ రవికుమార్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ‘నడిరోడ్డుపై పట్టిన చేపలు భలే టేస్టీ’.. నిరసన తెలపడంతో ఈ ఎమ్మెల్యే స్టైలే వేరప్పా

ఏపీలో నెవ్వర్ బిఫోర్.. పోలీస్ బాస్‌కు గ్రాండ్‌గా సెండాఫ్.. రోడ్లన్నీ పూలమయం