ఊహించని ప్రమాదం.. నడుపుతున్న ట్రాక్టరే అతడి ప్రాణం తీసింది.. విధి కాటేయడమంటే ఇదేనేమో
ప్రస్తుతం మనం బిజీ ప్రపంచంలో బ్రతుకుతున్నాం. తీరిగ్గా తినడానికి కూడా స్పెస్ లేదు. అందుకే తింటూనే ఏదో ఒక పనిచేస్తాం. అలాగే చాలాసార్లు రెండు పడవల ప్రయాణం చేయడం మనకు అలవాటుగా మారిపోయింది.
ప్రస్తుతం మనం బిజీ ప్రపంచంలో బ్రతుకుతున్నాం. తీరిగ్గా తినడానికి కూడా స్పెస్ లేదు. అందుకే తింటూనే ఏదో ఒక పనిచేస్తాం. అలాగే చాలాసార్లు రెండు పడవల ప్రయాణం చేయడం మనకు అలవాటుగా మారిపోయింది. కానీ ప్రతి పనిలో శ్రద్ద లేకపోతే మూల్యం చెల్లించక తప్పదు. తాజాగా ఓ యువకుడి ఆదమరిచి చేసిన ఓ పని ప్రాణం తీసింది. ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న యువకుడు ప్రమాదవశాత్తూ అదే ట్రాక్టర్ కింద పడి తనువు చాలించాడు. ట్రాక్టర్‌కు రిపేర్లు చేసి కిందనుంచే ఆన్‌చేయగా… ఒక్కసారిగా అది ముందుకు కదిలి డ్రైవర్ పైనుంచి వెళ్లడంతో అతడు మృత్యువాతపడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే సాయినగర్, దేవేందర్‌నగర్ కాలనీకి చెందిన వల్లెపు మహేశ్ అనే 18 ఏళ్ల యువకుడు ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం 12.45 గంటలకు మహేష్ కైసర్‌నగర్ నుంచి బాచుపల్లికి ట్రాక్టర్ నడుపుతూ వస్తున్నాడు. అయితే మార్గమధ్యంలో ట్రాక్టర్ ఇంజన్ నుంచి డీజిల్ కారడం స్టార్టయ్యింది. దీంతో రోడ్డు పక్కన గేర్‌లోనే ఉంచి ఆపాడు. ఇంజన్ పార్ట్స్ విప్పి రిపేర్ చేశాడు. అనంతరం సీటు ఎక్కకుండానే కింద ఉండి అజాగ్రత్తగా ట్రాక్టర్‌ను స్టార్ట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా అది ముందుకు కదిలింది.
బరువు ఎక్కువగా ఉండే బ్యాక్ టైర్ మహేష్‌పై నుంచి వెళ్లింది. దీంతో వెంటనే అక్కడే ఉన్న అతడి మిత్రుడు జాషువా, బాచుపల్లి పోలీసులు అతడిని స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. ఈ క్రమంలో మహేశ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి చనిపోయాడు. మృతుడి బంధువుల కంప్లైంట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: