Hyderabad: భాగ్యనగరంలో మరో పుష్ప.. పెళ్లి చేసుకుంటానన్న ప్రియుడిని ఏకంగా బ్లేడ్‌తో..
పెళ్లి చేసుకుంటానంటూ ప్రియుడు.. ప్రియురాలికి చెప్పాడు.. ఈ విషయం పదే పదే చెప్పడంతో ప్రియురాలు అభ్యంతరం చెప్పింది.. చివరకు పెళ్లి ప్రస్తావన కాస్త.. ఇద్దరు ప్రేమికుల మధ్య ఘర్షణకు దారితీసింది.
పెళ్లి చేసుకుంటానంటూ ప్రియుడు.. ప్రియురాలికి చెప్పాడు.. ఈ విషయం పదే పదే చెప్పడంతో ప్రియురాలు అభ్యంతరం చెప్పింది.. చివరకు పెళ్లి ప్రస్తావన కాస్త.. ఇద్దరు ప్రేమికుల మధ్య ఘర్షణకు దారితీసింది. చివరకు ప్రియురాలు దాడిలో ప్రియుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఏకంగా ప్రియురాలు బ్లేడ్‌తో దాడి చేయడంతో తీవ్రగాయమైంది. ఈ సంచలన ఘటన హైదరాబాద్ కేపీహెచ్‌బీలో చోటుచేసుకుంది.
హైదరాబాద్ పోలీసులు వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన అశోక్, రాజమండ్రికి చెందిన ఓ యువతి హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఉంటున్నారు. కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్న వీళ్లిద్దరి మధ్యలో దాడికి కారణం పెళ్లి ప్రస్తావనగా తెలుస్తోంది. అశోక్ పదేపదే పెళ్లి ప్రస్తావన తేవడంతో విసుగుచెందిన సదరు యువతి అతనిపై బ్లేడుతో దాడిచేసినట్లు చెబుతున్నారు.
చెవికింద లోతైన గాయంతో అతను ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడు. పెళ్లి ప్రస్తావన తెస్తే దాడి చేస్తావా అంటూ అశోక్ ఆమెపై కేసు పెట్టాడు. ఆమెపై హత్యాయత్నం కేసు పెట్టిన పోలీసులు.. స్టేషన్‌కు తరలించారు.
ఈ ఘటనకు సంబందించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..