Hyderabad: హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌.. సోమవారం ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం..

|

Apr 10, 2022 | 1:20 PM

Hyderabad: హైదరాబాద్‌ మహానగరంలో మంచి నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. నగరంలోని పలు ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తున్న మంజీరా వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్ -2కి సంబంధించి పటాన్‌చెరు నుంచి హైదర్‌గూడకు ఉన్న 1500 ఎంఎం డయా పంపింగ్..

Hyderabad: హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌.. సోమవారం ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం..
Water Supply In Hyderabad
Follow us on

Hyderabad: హైదరాబాద్‌ మహానగరంలో మంచి నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. నగరంలోని పలు ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తున్న మంజీరా వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్ -2కి సంబంధించి పటాన్‌చెరు నుంచి హైదర్‌గూడకు ఉన్న 1500 ఎంఎం డయా పంపింగ్ మెయిన్ పైప్‌కు ఏర్పడ్డ లీకేజీలు నివారించేందుకు గాను ఆర్‌.సి పురంలోని లక్ష్మీ గార్డెన్, మదీనాగూడలోని సుమన్ కాలేజీ వద్ద మరమ్మత్తు పనులను జలమండలి చేపట్టనుంది. సోమవారం (11-04-2022) ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు అంటే మంగళవారం (12-04-2022) ఉదయం 6 గంటలకు వరకు మొత్తం 24 గంటలపాటు పనులు కొనసాగనున్నాయి. దీంతో మంజీరా వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్ – 2 కింద ఉన్న రిజర్వాయర్ల పరిధిలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.

అంతరాయం ఏర్పడే ప్రాంతాలు ఇవే..

మరమ్మత్తుల కారణంగా బీరంగూడ, అమీన్‌పూర్, ఆర్.సి.పురం, దీప్తిశ్రీనగర్, మదీనాగూడ, గంగారం, చందానగర్, మియాపూర్, కేపీహెచ్బీ కాలనీ, కూకట్‌పల్లి, భాగ్యనగర్ కాలనీ, ప్రగతినగర్, నిజాంపేట, బాచుపల్లి, బొల్లారం, హైదర్‌నగర్‌ రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాల్లో 24 గంటల పాటు నీటి సరఫరా నిలిచిపోనుంది. అలాగే ఎర్రగడ్డ, బంజారాహిల్స్ రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాల్లో ఈ 24 గంటల పాటు లో ప్రెషర్‌తో నీటి సరఫరా అవుతుందని అధికారులు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి నీటి సరఫరాకు అంతరాయం కలిగే ప్రాంతాల్లో నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరారు.

Also Read: Gujarat: భారత సైనికుల వీరగాథలతో ప్రదర్శన.. నాడబెట్‌లో వ్యూపాయింట్‌ను ప్రారంభించిన అమిత్ షా

Viral Video: మహిళకు సాయం చేసిన వ్యక్తి అనంతరం కిందపడిన వ్యక్తి నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

MP Ramp Walk: పొలిటిషన్ అయితే ఫ్యాషన్ ఉండకూడదా..! ర్యాంప్‌ వాక్‌ చేసి ర్యాంప్ ఆడించిన ఆప్‌ ఎంపీ..