హైదరాబాద్ వాసులకు జల మండలి అధికారులు కీలక సూచన చేశారు. సిటీలో వచ్చే శనివారం పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం కలగనున్నట్లు తెలిపారు. జలమండలి సరఫరా చేస్తున్న మంచి నీటి సరఫరా పైపులైన్ మైలార్ దేవ్ పల్లి ఫేజ్-2 లోని 5 ఎంఎల్ రిజర్వాయర్ 1200 ఎంఎం డయా స్లూయిజ్ కు మరమ్మతు పనులు చేపడుతున్నారు. 28వ తేదీ శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ పనులు జరుగుతాయి. కావున ఈ 8 గంటలు కింద పేర్కొన్న ప్రాంతాల్లో మంచి నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది.
ఓ అండ్ ఎం డివిజన్ నం.1 : శాస్త్రిపురం
ఓ అండ్ ఎం డివిజన్ నం.2 : బండ్లగూడ
ఓ అండ్ ఎం డివిజన్ నం.3 : భోజగుట్ట
ఓ అండ్ ఎం డివిజన్ నం.4 : ఆళ్లబండ
ఓ అండ్ ఎం డివిజన్ నం.16 : మధుబన్, దుర్గా నగర్, బుద్వేల్, సులేమాన్ నగర్, గోల్డెన్ హైట్స్, 9 నంబర్
ఓ అండ్ ఎం డివిజన్ నం.18 : కిస్మత్పూర్, గంధం గూడ
ఓ అండ్ ఎం డివిజన్ నం.20 : ధర్మసాయి
కాబట్టి ఈ సమయంలో ఆయా ప్రాంతాలకు నీటి సరఫరా ఆగిపోనుందని.. ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని అధికారులు కోరారు. ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..