ప్రభుత్వ సలహదారు పదవికి వివేక్‌ రాజీనామా

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో సీట్ల సర్ధుబాటు అంశాలు పార్టీ అధినేతలకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. అసంత‌ృప్త నేతలు రాజీనామాలు చేయడమో, రెబల్స్‌గా బరిలోకి దిగడమో చేస్తున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేస్తున్నట్టు మాజీ ఎంపీ వివేక్‌ ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో పెద్దపల్లి సీటు ఇస్తామని సీఎం కేసీఆర్‌ తనకు హామీ ఇచ్చారని.. కానీ తనకు  టికెట్‌ ఇవ్వలేదని వివేక్‌ ఆవేదన వ్యక్తంచేశారు. అందుకే  తాను ప్రభుత్వ సలహదారు పదవికి రాజీనామా చేస్తున్నట్టు స్పష్టంచేశారు. […]

ప్రభుత్వ సలహదారు పదవికి వివేక్‌ రాజీనామా

Edited By:

Updated on: Mar 22, 2019 | 9:53 PM

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో సీట్ల సర్ధుబాటు అంశాలు పార్టీ అధినేతలకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. అసంత‌ృప్త నేతలు రాజీనామాలు చేయడమో, రెబల్స్‌గా బరిలోకి దిగడమో చేస్తున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేస్తున్నట్టు మాజీ ఎంపీ వివేక్‌ ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో పెద్దపల్లి సీటు ఇస్తామని సీఎం కేసీఆర్‌ తనకు హామీ ఇచ్చారని.. కానీ తనకు  టికెట్‌ ఇవ్వలేదని వివేక్‌ ఆవేదన వ్యక్తంచేశారు. అందుకే  తాను ప్రభుత్వ సలహదారు పదవికి రాజీనామా చేస్తున్నట్టు స్పష్టంచేశారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని సీఎం కేసీఆర్‌ను కోరారు.  ప్రభుత్వ సలహదారు హోదాలో ఎలాంటి ఆర్థిక ప్రయోజనం పొందలేదని వివేక్‌ చెప్పారు. పెద్దపల్లి టికెట్‌ కోసం చివరి దాకా  వివేక్‌ తీవ్రంగా ప్రయత్నాలు చేసినప్పటికీ  కేసీఆర్ ఆయన వైపు మొగ్గు చూపలేదు. పెద్దపల్లి ఎంపీ టిక్కెట్‌ను తెరాస నేత బోరకుంట్ల వెంకటేశ్‌కి కేటాయించిన విషయం తెలిసిందే. మరి వివేక్‌ను అధిస్టానం ఏ విధంగా బుజ్జగిస్తుందో చూడాలి.