
ప్రముఖ కవి, గేయ రచయిత వాయలార్ రామవర్మ 50వ వర్ధంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లో సాంస్కృతిక సమావేశం జరగనుంది.. వాయలార్ రామవర్మ చేసిన విశేష కృషికి గాన సంధ్య నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని నవీన్ సంస్కార కళా కేంద్రంలో వాయలార్ సంస్మరణ సభతోపాటు.. గాన సంధ్య కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆగస్టు 9, శనివారం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లోని ఫిరోజ్‌గూడలోని ఎన్‌ఎస్‌కెకె హై స్కూల్ ఆడిటోరియంలో సాంస్కృతిక సమావేశం జరుగుతుంది.
ఈ సదస్సుకు వాయలార్ కుమారుడు, ప్రముఖ కవి, గేయ రచయిత వాయలార్ శరత్ చంద్ర వర్మ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అలాగే.. గాయకుడు, రచయిత డాక్టర్ సజీత్ ఎవెరెత్ గౌరవ అతిథిగా హాజరవుతారని హైదరాబాద్‌లోని నవీన్ సంస్కృతి కళా కేంద్రం సిబ్బంది ప్రకటించారు.
Vayalar Ramavarma 50th Death Anniversary
వాయలార్ రామవర్మ గొప్ప కవి, గేయ రచయితగా ప్రసిద్ధి చెందారు.. 256 మలయాళ చిత్రాలకు సుమారు 1,300 పాటలకు రాశారు. వాయలార్ సర్గసంగీతం, మూలంకాడు, పదముద్రకల్, ఆయిషా, ఒరు జుడాస్ జానిక్కున్ను వంటి పద్యాలకు ప్రసిద్ధి చెందారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..