Krishnam Raju: కృష్ణంరాజు కుటుంబానికి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పరామర్శ..

|

Sep 16, 2022 | 3:39 PM

కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి, వారి కుమార్తెలతో పాటు, హీరో ప్రభాస్‌ను కేంద్రమంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ సింగ్‌.. కృష్ణంరాజు మృతిపట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Krishnam Raju: కృష్ణంరాజు కుటుంబానికి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పరామర్శ..
Krishna Raju's Family
Follow us on

Rajnath Singh visits Krishna Raju’s family: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌.. దివంగత సినీ నటుడు, బీజేపీ నేత కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించారు. శుక్రవారం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ వచ్చిన కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ కృష్ణంరాజు ఇంటికి వెళ్లి.. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి, వారి కుమార్తెలతో పాటు, హీరో ప్రభాస్‌ను కేంద్రమంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ సింగ్‌.. కృష్ణంరాజు మృతిపట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన అనారోగ్యానికి కారణం ఏంటి? ఎలాంటి చికిత్సలు తీసుకున్నారు.. తదితర వివరాలను ఎంపీ లక్ష్మణ్‌ రాజ్‌నాథ్‌కు వివరించారు. కృష్ణంరాజు సతీమణి, కుమార్తెలకు ధైర్యం చెప్పారు.

అనంతరం షేక్‌పేట్‌ దర్గా సమీపంలోని జేఆర్సీ కన్వెన్షన్‌లో క్షత్రియ సేవా సమితి ఆద్వర్యంలో నిర్వహిస్తున్న కృష్ణంరాజు సంతాపసభకు రాజ్‌నాథ్‌సింగ్‌ చేరుకున్నారు. ఆయన వెంట కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్‌ ఉన్నారు.

ఇవి కూడా చదవండి

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నటుడు కృష్ణంరాజు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం