AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kavitha: ఢిల్లీలో కూర్చొని మీడియాను తప్పుదారి పట్టించారు.. ఈడీ నోటీసుల ప్రచారంపై స్పందించిన కవిత

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ లో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిందంటూ కూడా ప్రచారం జరుగుతోంది. కాగా, ఈడీ నోటీసుల ప్రచారంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు.

Kavitha: ఢిల్లీలో కూర్చొని మీడియాను తప్పుదారి పట్టించారు.. ఈడీ నోటీసుల ప్రచారంపై స్పందించిన కవిత
Mlc Kavitha
Shaik Madar Saheb
|

Updated on: Sep 16, 2022 | 5:00 PM

Share

Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ దేశ రాజకీయాల్లో కలకలం రేపింది.. ఇప్పటికే దీనిపై దర్యాప్తు ప్రారంభించిన ఈడీ.. దేశవ్యాప్తంగా ఆకస్మిక దాడులతో సంచలనం సృష్టిస్తోంది. ఇటీవల హైదరాబాద్ సహా పలు చోట్ల దాడులు చేసిన ఈడీ, తాజాగా శుక్రవారం కూడా.. దేశవ్యాప్తంగా ఈరోజు 40 చోట్ల సోదాలు నిర్వహిస్తోంది. అయితే, ఈ వ్యవహారంలో సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత హస్తం ఉందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. దీంతోపాటు కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిందంటూ కూడా ప్రచారం జరుగుతోంది. కాగా, ఈడీ నోటీసుల ప్రచారంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు.

ఈడీ నుంచి తనకు ఎలాంటి నోటీసులు రాలేదని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఢిల్లీలో కూర్చొని మీడియాను తప్పుదారి పట్టించారన్నారు. నిజనిర్ధారణ తర్వాతే వార్తలు వేయాలి, రాయాలంటూ కవిత సూచించారు. ఈ సమయాన్ని నిజం చూపించడానికి ఉపయోగించమని మీడియా సంస్థలను అభ్యర్థించారు. ఈ మేరకు కవిత ట్విట్ చేశారు.

ఇవి కూడా చదవండి

కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాం దాడుల్లో భాగంగా ఈడీ అధికారులు హైదరాబాద్‌లోని గోరంట్ల అసోసియేట్స్‌ కార్యాలయంలో సోదాలు చేశారు. దోమలగూడ అరవింద్‌నగర్‌లోని.. సాయికృష్ణ రెసిడెన్సీలో ఉంది గోరంట్ల అసోసియేట్స్. గోరంట్ల బుచ్చిబాబు కొందరు ప్రముఖులకు ఆడిటర్‌గా ఉన్నారు. చార్టెడ్ అకౌంట్‌కు సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇంకా, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి నివాసంలోనూ సోదాలు జరిగాయి. ఢిల్లీ లోథీ రోడ్‌లోని 95వ నంబర్ బంగ్లాలో ఉదయం నుంచి తనిఖీలు జరుగుతున్నాయి. మాగుంట నెల్లూరు నివాసంలోనూ ఈడీ రెయిడ్స్ జరిగాయి.

దీంతోపాటు మాదాపూర్ లోని అనుస్ బ్యూటీ పార్లర్ హెడ్ ఆఫీస్‌లోనూ ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. అనూస్ బ్యూటీ పార్లర్ రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఉంది. ఇప్పటికే రెండు సార్లు హైదరాబాద్‌లో దాడులు నిర్వహించిన ఈడీ… తాజాగా మళ్లీ హైదరాబాద్‌పైనే గురి పెట్టింది. దీంతో… ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ డొంక కదిలి.. ఇందులో తెలుగు రాష్ట్రాలకున్న లింకులు బైటపడతాయా అనే సందేహాలు మొదలయ్యాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Follow Us
నవ్వుతూ ఉండాల్సిన సమయం ఆరంభం.. శివుడి అనుగ్రహంతో వీరికి అంతా మంచే
నవ్వుతూ ఉండాల్సిన సమయం ఆరంభం.. శివుడి అనుగ్రహంతో వీరికి అంతా మంచే
ప్రశాంతమైన మరణానికి మార్గం సుగమం!!
ప్రశాంతమైన మరణానికి మార్గం సుగమం!!
రైల్లో రెచ్చిపోయిన కొత్తజంట.. దెబ్బకు టీసీ ఉద్యోగం ఊస్ట్‌!
రైల్లో రెచ్చిపోయిన కొత్తజంట.. దెబ్బకు టీసీ ఉద్యోగం ఊస్ట్‌!
మ్యాజిక్ చేసే డ్రింక్ ఇది.. హెయిర్ ఫాల్ దెబ్బకు ఆగిపోతుంది..
మ్యాజిక్ చేసే డ్రింక్ ఇది.. హెయిర్ ఫాల్ దెబ్బకు ఆగిపోతుంది..
ఈసీజీ కూడా కనిపెట్టలేనిది.. ఏఐ కనిపెట్టేసిందిగా!
ఈసీజీ కూడా కనిపెట్టలేనిది.. ఏఐ కనిపెట్టేసిందిగా!
గరుడ పురాణం ప్రకారం అత్యాచారాలు, లైంగిక దురాచారాలకు ఎంత ఘోరమైన..
గరుడ పురాణం ప్రకారం అత్యాచారాలు, లైంగిక దురాచారాలకు ఎంత ఘోరమైన..
స్టార్ హీరో చేయాల్సిన సినిమా.. సత్యదేవ్‌ ఖాతాలోకి వచ్చింది!
స్టార్ హీరో చేయాల్సిన సినిమా.. సత్యదేవ్‌ ఖాతాలోకి వచ్చింది!
వానాకాలం నాన్‌వెజ్ ముచ్చట.. చికెన్ vs మటన్.. ఏది తింటే మంచిది..?
వానాకాలం నాన్‌వెజ్ ముచ్చట.. చికెన్ vs మటన్.. ఏది తింటే మంచిది..?
ఉప్పునీటితో విద్యుత్‌.. సముద్ర గర్భంలో సరికొత్త విప్లవం
ఉప్పునీటితో విద్యుత్‌.. సముద్ర గర్భంలో సరికొత్త విప్లవం
గురు ఆదిత్య రాజయోగం.. ఈ రాశుల వారికి అదృష్టమే అదృష్టం
గురు ఆదిత్య రాజయోగం.. ఈ రాశుల వారికి అదృష్టమే అదృష్టం