Amit Shah: చరిత్రను వక్రీకరించారు.. వారిని ప్రజలు ఎప్పటికీ క్షమించరు.. అమిత్ షా సంచలన వ్యాఖ్యలు..

Telangana Liberation Day 2023 Celebrations: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వేదికగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయి. ఈ వేడుకలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న భాగంగా ఆదివారం ఉదయం అమిత్ షా..

Amit Shah: చరిత్రను వక్రీకరించారు.. వారిని ప్రజలు ఎప్పటికీ క్షమించరు.. అమిత్ షా సంచలన వ్యాఖ్యలు..
Union Home Minister Amit Shah

Updated on: Sep 17, 2023 | 11:27 AM

Telangana Liberation Day 2023 Celebrations: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వేదికగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయి. ఈ వేడుకలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న భాగంగా ఆదివారం ఉదయం అమిత్ షా.. సీఆర్పీఎఫ్ సెక్టార్ నుంచి పరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్నారు. మొదట వార్ మెమోరియల్ దగ్గర అమిత్ షా అమర జవాన్లకు నివాళులు అర్పించారు. అనంరతం అమిత్ షా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రజలకు అభివాదం చేశారు. ఆ తర్వాత సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో భాగంగా పరేడ్‌ గ్రౌండ్‌లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. బతుకమ్మ ఆటపాట, కోయనృత్యాలు, డప్పు కళాకారుల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. బోనాలు, పోతురాజుల విన్యాసాలు, ఉగ్గు కళాకారుల ప్రదర్శనలు.. తెలంగాణ వైభవం ఉట్టిపడేలా అందరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి.

పరేడ్ గ్రౌండ్ సభలో మాట్లాడిన అమిత్ షా హైదరాబాద్‌కు ఇవాళ విముక్తి లభించిన రోజని.. తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలిపారు. విముక్తి పోరాటంలో పాల్గొన్న యోధులకు వందనాలు తెలిపారు. సర్ధార్ వల్లభాయ్ పటేల్ లేకపోతే తెలంగాణకు విముక్తి వచ్చేది కాదని అమిత్ షా అభిప్రాయపడ్డారు. పటేల్, కేఎం మున్షి వల్లే నిజాం పాలన అంతం అయిందని అమిత్ షా పేర్కొన్నారు. తెలంగాణ పోరాట యోధులకు ఈ సందర్భంగా వందనాలు తెలిపారు. తెలంగాణ విమోచన దినాన్ని కొందరు రాజకీయం చేస్తున్నారు.. వాళ్లను దేశ ప్రజలు వాళ్లను క్షమించరు అంటూ అమిత్‌షా పేర్కొన్నారు. 75 ఏళ్ల పాటు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని వక్రీకరించారన్నారు.

స్వాతంత్ర్య పోరాటాన్ని కూడా కాంగ్రెస్‌ వక్రీకరించిందంటూ ఫైర్ అయ్యారు. భవిష్యత్‌ తరాలకు తెలంగాణ విమోచన చరిత్ర తెలియాలి.. అంటూ పేర్కొన్నారు. 9 ఏళ్ల మోడీ పాలనలో ఎంతో ప్రగతి సాధించామని అమిత్ షా పేర్కొన్నారు. భారత్ సత్తా ఏంటో ప్రపంచానికి చాటిచెప్పామని వివరించారు. మోడీ ప్రభుత్వ హయాంలో చంద్రయాన్ సక్సెస్, జీ20 సమ్మిట్ విజయవంతం అయిందని గుర్తుచేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులను మోడీ సరిద్దారని తెలిపారు.

ఎందరో బలిదానాలతోనే తెలంగాణకు స్వాతంత్ర్యం

ఎందరో బలిదానాల వల్లే తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలలు ఆలస్యంగా తెలంగాణకు స్వేచ్ఛ లభించిందన్నారు. రజాకార్లు తెలంగాణ ప్రజలను పీడించారని వివరించారు.