Hyderabad Traffic: లష్కర్ బోనాలకు సర్వం సిద్ధం.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. రూల్స్ పాటించాలని పోలీసుల సూచన!

|

Jul 24, 2021 | 12:22 PM

Traffic Restrictions: లష్కర్ బోనాల జాతరకు సికింద్రాబాద్‌ శ్రీఉజ్జయిని మహాకాళి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది.. అమ్మవారికి మొక్కులు తీర్చుకునేందుకు భాగ్యనగర వాసులు సిద్ధమయ్యారు.

Hyderabad Traffic: లష్కర్ బోనాలకు సర్వం సిద్ధం.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. రూల్స్ పాటించాలని పోలీసుల సూచన!
Ujjaini Mahankali Bonalu 2021
Follow us on

Hyderabad Traffic Restrictions: తెలంగాణలో బోనాల సందడి కొనసాగుతోంది. లష్కర్ బోనాల జాతరకు సికింద్రాబాద్‌ శ్రీఉజ్జయిని మహాకాళి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది.. అమ్మవారికి మొక్కులు తీర్చుకునేందుకు భాగ్యనగర వాసులు సిద్ధమయ్యారు. ఆదివారం ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర పండుగగా ప్రకటించిన సర్కార్.. రెండు రోజులపాటు అట్టహాసంగా నిర్వహించేందుకు ఆషాఢమాస బోనాల సమర్పణకు అధికారులు అన్ని వసతులు కల్పించారు. ఈనెల 25న బోనాలు, ఫలహారం బండ్ల ఊరేగింపు, 26న రంగం, ఊరేగింపు కార్యక్రమాల నిర్వహణకు ఆలయ అధికారులు, ఆయా ప్రభుత్వ శాఖలు శుక్రవారం సాయంత్రానికే ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

ఉజ్జయినీ మహాకాళి బోనాల సందర్భంగా హైదరాబాద్ మహానగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. భారీగా భక్తులు తరలివచ్చే అవకాశమున్నందున రెండు రోజుల పాటు ఆలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలను విధిస్తున్నట్లు సీపీ తెలిపారు. బోనాలు జరిగే ఆది, సోమవారాల్లో ఆలయ ప్రాంతాల్లో వాహనాలకు అనుమతి ఉండదని తెలిపారు. భక్తులకు తగిన పార్కింగ్‌ ఏర్పాట్లు చేశామన్నారు. ఆదివారం మధ్యాహ్నం ఉదయం నాలుగు నుంచి పూజ ముగిసే వరకు, సోమవారం మద్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి పది వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు సీపీ.

మరోవైపు, కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటిస్తూ బోనాలు సమర్పించాలని అధికారులు సూచిస్తున్నారు. భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని కోరుతున్నారు. బోనాలు సమర్పించేందుకు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేశామని, భక్తులు కోసం విడిగా, బోనాలు తరలించేందుకు మరో లైన్ ఏర్పాటు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Read Also… 

Covid 19: కొత్త వేరియంట్లు ప్రమాదకరంగా మారుతున్నాయి.. సెప్టెంబర్ కల్లా పిల్లలకు కోవిడ్ టీకాలుః ఎయిమ్స్ చీఫ్ గులేరియా

Hyundai: భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న కార్లపై హ్యుందాయ్‌ కీలక నిర్ణయం..ఇన్సూరెన్స్‌ ప్రీమియం తగ్గింపు