Two youths commit suicide: వికారాబాద్ జిల్లా తాండూరు మండలం అల్లాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని ఓ యువకుడు నిండు ప్రాణాన్ని తీసుకున్నాడు. ట్రైన్ కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ చేసుకోవడానికి ముందు యువకుడు తీసిన సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. మృతుడు మహేష్.. మల్లారెడ్డి కాలేజీలో బీటెక్ చదువుతున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో మరో మెడికో స్టూడెంట్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. మృతుడు జగదీష్ నారాయణపేట జిల్లా మద్దూర్‌కు చెందిన వాసిగా గుర్తించారు. జగదీష్ ఆత్మహత్య చేసుకోబోయే ముందు రోజు రాత్రి తన రూమ్‌లో ఓ యువతితో గొడవ పడినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న మధురానగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కాగా.. ఈ రెండు ఘటనలు తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేపాయి. చేతికొచ్చిన ఇద్దరూ కూడా చనిపోవడం.. ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం మిగిల్చింది..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..