Hyderabad: హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్‌లో కంగారుగా స్టూడెంట్స్.. పోలీసులు వెళ్లి తనిఖీ చేయగా

|

Mar 30, 2025 | 10:03 PM

పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నిఘా పెట్టి దాడులతో దడ పుట్టిస్తున్నారు. అయినా.. హైదరాబాద్‌ను మత్తు జాడ వీడటం లేదు. గంజాయి, సింథటిక్ డ్రగ్స్, కొకైన్‌ నగరమంతటా చాపకింద నీరులా విస్తరిస్తూనే ఉన్నాయి. బడికి పోయే పిల్లాడి నుంచి డిగ్రీ చేస్తున్న యువకుడి దాకా.. మత్తుమందుకు అలవాటు పడుతున్నారు. మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారడంతో ఉత్సాహంతో ఉరకలెత్తాల్సిన యువత.. జవసత్వాలు సన్నగిల్లుతున్నాయి. కొన్నాళ్లకు విద్యార్థులే ఈ దందాలోకి దిగడం ఆందోళనకరంగా మారింది. తాజాగా...

Hyderabad: హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్‌లో కంగారుగా స్టూడెంట్స్.. పోలీసులు వెళ్లి తనిఖీ చేయగా
Hafeezpet Railway Station
Follow us on

వారు ఎంతో భవిష్యత్ ఉన్న స్టూడెంట్స్. కానీ మత్తుకు అలవాటుపడ్డారు. కాలక్రమేణ ఇంకా దిగజారిపోయారు. ఏకంగా ఆ మత్తును తామే సప్లై చేస్తే ఈజీగా మనీ కూడా సంపాదించవచ్చని ఆలోచన చేశారు. కానీ పోలీసులకు పట్టుబడి బంగారం లాంటి భవిష్యత్‌ను బుగ్గిపాలు చేసుకున్నారు.

మహారాష్ట్రలోని పర్లి నుంచి హైదరాబాద్‌కు 2.7 కిలోల గంజాయిని తరలిస్తున్న ఇద్దరు విద్యార్థులను మియాపూర్‌లోని హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్‌లో బాలానగర్ స్పెషల్ ఆపరేషన్స్ టీం (SOT) అరెస్టు చేసింది. పట్టుబడిన గంజాయి విలువ 91,000 రూపాయలుగా పోలీసులు తెలిపారు.  నిందితులను కూకట్‌పల్లిలోని సిద్ధార్థ డిగ్రీ & పీజీ కళాశాల విద్యార్థులు పాటిబాల వెంకట సత్య నరసింహ స్వామి (20), గడ్డి దీపక్ (23) గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వీరిద్దరూ పర్లికి చెందిన సప్లయర్ ఎండి అమ్జాద్ నుంచి గంజాయి కొనుగోలు చేసి, రైలులో హైదరాబాద్‌కు తరలించారు.

మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అమ్జాద్ డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్‌ ఏ స్థాయిలో ఉంది.. అతను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా గంజాయి సరఫరా చేస్తున్నాడా…? ప్రస్తుతం దొరికిన స్టూడెంట్స్‌ గంజాయికి అడిక్ట్ అయ్యారా..? వారికి గంజాయి అమ్మాలనే ఆలోచన ఎలా వచ్చింది..? గతంలో ఎన్నిసార్లు ఈ తరహాలో రవాణా చేశారు వంటి కోణాల్లో పోలీసుల దర్యాప్తు సాగుతుంది.

Students With Ganja

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.