తెలుగు రాష్ట్రాలకు మరో గుడ్ న్యూస్ వచ్చేసింది. మరికొన్ని రోజుల్లో ఒకటి కాదు ఏకంగా రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు పట్టాలెక్కనున్నాయి. ఇక బెంగళూరుకు వెళ్లే ప్రయాణీకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను మరో మూడు రోజుల్లో పరుగులు పెట్టనుంది. హైదరాబాద్, బెంగళూరు మధ్య పరుగులు పెట్టే ఈ రైలును ప్రధాని మోదీ సెప్టెంబరు 24న వర్చువల్‌గా పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. ఆ రోజున కాచిగూడ నుంచి ఉదయం 5.30 గంటలకు ట్రైన్ బయల్దేరనుండగా.. మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకోనుంది. ఇక మరుసటి రోజు అనగా సెప్టెంబర్ 25 నుంచి ఈ రైలు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటుంది. సోమవారం ఉదయం ఐదున్నర గంటలకు ఈ రైలు బయలుదేరి.. మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురం, ధర్మవరం, హిందూపురం మీదుగా మధ్యాహ్నం రెండు గంటలకు యశ్వంత్‌పూర్‌కు చేరుకుంటుంది. తిరిగి 2 గంటల 45 నిమిషాలకు యశ్వంత్‌పూర్ నుంచి బయలుదేరి రాత్రి 11 గంటల 45 నిమిషాలకు కాచిగూడ చేరుకుంటుంది.
ఈ రైలుతో పాటు సెప్టెంబర్ 24న ప్రధాని మోదీ మొత్తం 9 వందేభారత్ రైళ్లను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. వీటిల్లో విజయవాడ-చెన్నై వందేభారత్ కూడా ఉంది. ఈ రైలు విజయవాడ నుంచి తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా చెన్నై చేరుకుంటుంది. గురువారం మినహా అన్ని రోజులు ఈ ట్రైన్ ప్రయాణీకులకు అందుబాటులో ఉంటుంది. ఇక ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రోజూ ఉదయం ఐదున్నర గంటలకు విజయవాడలో బయలుదేరి, మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు చెన్నై చేరుకుంటుదని వివరించారు. తిరిగి చెన్నైలో మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకి ప్రారంభమై రాత్రి 10 గంటలకు విజయవాడకు చేరుతుందని రైల్వే అధికారులు చెప్పారు.
కాగా, ఇప్పటికే ఏపీ, తెలంగాణ మధ్య నడుస్తోన్న రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లకు ఎక్కువగా ప్రజాదరణ ఉంది. సికింద్రాబాద్-విశాఖపట్నం, సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడిచే ఈ రైళ్లల్లో సీట్లు హౌస్‌ఫుల్ అవుతున్నాయి. రెండూ రద్దీగా ఉండే రూట్లు కావడంతో ప్రయాణీకులు సౌకర్యవంతంగా తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు ఈ వందేభారత్ రైళ్లనే ఎంచుకోవడం విశేషం.
Vande Bharat trains to get technical changes – @THHyderabad @RailMinIndia #VandeBharat pic.twitter.com/HfiXZL7fqU
— South Central Railway (@SCRailwayIndia) September 21, 2023
IR upgrading Vande Bharat trains for enhanced passenger comfort#VandeBharat @RailMinIndia pic.twitter.com/Ee7W0ZKxhe
— South Central Railway (@SCRailwayIndia) September 21, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..