AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గచ్చిబౌలిలో ఇద్దరు చిన్నారుల కిడ్నాప్ కలకలం.. గంటల వ్యవధిలోనే ఛేదించిన పోలీసులు!

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర ఆందోళన రేపిన ఇద్దరు చిన్నారుల అదృశ్యం ఉదంతం సుఖాంతమైంది. పోలీసులు అత్యంత వేగంగా స్పందించి, సమయస్ఫూర్తితో వ్యవహరించి గంటల వ్యవధిలోనే ఈ కిడ్నాప్ మిస్టరీని ఛేదించారు. నిందితుడి బారి నుంచి ఇద్దరు పసికందులను సురక్షితంగా రక్షించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు.

గచ్చిబౌలిలో ఇద్దరు చిన్నారుల కిడ్నాప్ కలకలం.. గంటల వ్యవధిలోనే ఛేదించిన పోలీసులు!
Child Kidnapping
Vidyasagar Gunti
| Edited By: |

Updated on: Aug 25, 2026 | 11:17 AM

Share

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపిన ఇద్దరు చిన్నారుల అదృశ్యం ఉదంతం సుఖాంతమైంది. పోలీసులు వేగంగా స్పందించి గంటల వ్యవధిలోనే ఈ కిడ్నాప్ కేసును ఛేదించి, చిన్నారులను సురక్షితంగా రక్షించారు. గచ్చిబౌలిలోని రాఘవ ప్రాజెక్ట్ లేబర్ క్యాంప్ లో నివాసముంటున్న ప్రమీలా ముర్ము (4), సంగీత (3½) అనే ఇద్దరు చిన్న పిల్లలను, వారితో పాటు పనిచేసే సహోద్యోగి చాకు సోరెన్ అపహరించాడు. షాప్‌నకు తీసుకెళ్లి మిఠాయిలు కొనిపిస్తానని నమ్మబలికి పిల్లలను తన వెంట తీసుకెళ్లాడు. ఎంతసేపటికీ వారు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు, చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకుండా పోయింది.

రాత్రి పొద్దుపోయినా పిల్లలతో పాటు చాకు సోరెన్ కూడా రాకపోవడంతో తీవ్ర భయాందోళనకు గురైన తల్లిదండ్రులు, అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు ఒంటి గంట ప్రాంతంలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి, లేబర్ క్యాంప్ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని నిశితంగా పరిశీలించారు. నిందితుడి కదలికలను సీసీటీవీ ఆధారంగా నిరంతరం ట్రాక్ చేస్తూ, అతడు రైలులో పారిపోవడానికి ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు.

పోలీసు బృందాలు సమయస్ఫూర్తితో వ్యవహరించి ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్‌ వద్ద నిందితుడు చాకు సోరెన్‌ను చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి ఇద్దరు చిన్నారులను క్షేమంగా కాపాడారు. పిల్లలను సురక్షితంగా పోలీస్ స్టేషన్‌కు తరలించి, వారి తల్లిదండ్రులకు అప్పగించారు. సకాలంలో స్పందించి, అధునాతన సాంకేతికతను ఉపయోగిస్తూ గంటల వ్యవధిలోనే తమ పిల్లలను దక్కించిన గచ్చిబౌలి పోలీసులకు బాధితులు, స్థానికులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us