Telugu News Telangana Hyderabad TV9 Telugu Sweeps NT awards, Manageing Editor Rajinikanth Vellalacheruvu Won Best Prime Time News Anchor Award
టీవీ9 తెలుగుకు NT అవార్డుల పంట.. మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్‌కు ప్రతిష్టాత్మక అవార్డ్
నేషనల్ టెలివిజన్ అవార్డుల విషయంలో టీవీ9 తెలుగు ప్రభంజనం కొనసాగుతుంది. ఈ ఏడాది 11 విభాగాల్లో టీవీ9 తెలుగు అవార్డులు దక్కించుకుంది. రజినీకాంత్, దీప్తి వాజ్‌పేయి..నేత్రావతి, ప్రణీతకు ప్రతిష్టాత్మక NT అవార్డులు దక్కాయి. బెస్ట్ డిబేట్ ప్రోగ్రాంగా టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ నిలిచింది.
టీవీ9 తెలుగుకు అవార్డుల పంట పండింది. వివిధ విభాగాల్లో టీవీ9 తెలుగుకు 11 నేషనల్ టెలివిజన్ అవార్డులు దక్కాయి. TV9 తెలుగు మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్‌కు.. ప్రతిష్టాత్మక ప్రైమ్‌టైమ్ న్యూస్ యాంకర్ అవార్డు దక్కింది. అంతేకాదు బెస్ట్ డిబేట్ షో అవార్డును సైతం ఆయన అందుకున్నారు. గ్రాఫిక్స్ విభాగంలో టీవీ9 తెలుగుకు రెండు అవార్డులు వచ్చారు. ఎంటర్టైన్‌మెంట్ విభాగంలో టీవీ9 తెలుగు సైన్మా 2.Oకు అవార్డు సాధించింది. పర్సనాలిటీ కేటగిరీలో టీవీ9 తెలుగుకు 4 అవార్డులు వచ్చాయి. రజినీకాంత్, దీప్తి వాజపేయ్.. నేత్రావతి, ప్రణీతకు ప్రతిష్టాత్మక నేషనల్ టెలివిజన్ అవార్డులు దక్కాయి. తాజాగా ఢిల్లిలో జరిగిన కార్యక్రమంలో టీవీ9 తెలుగు మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ వెల్లెలచెరువు, ఇతర విజేతలు అవార్డులు అందుకున్నారు. మొత్తంగా టీవీ9 నెట్‌వర్క్‌కు అన్ని భాషల్లో కలిపి 53 అవార్డులు వచ్చాయి. నెట్ వర్క్ అన్ని భాషల్లోనూ ప్రైమ్ టైమ్ అవార్డ్స్ సొంతం చేసుకోవడం విశేషం.
టీవీ9 తెలుగులో ఎవరెవరు ఏఏ విభాగాల్లో అవార్డులు దక్కించుకున్నారో తెలుసుకుందాం…
పర్సనాలిటీ అవార్డ్స్ — ప్రైమ్ టీవీ న్యూస్ యాంకర్ — రజినికాంత్ వెల్లెలచెరువు – బిగ్ న్యూస్ బిగ్ డిబేట్
పర్సనాలిటీ అవార్డ్స్ — టీవీ న్యూస్ ప్రెజెంటర్ – దీప్తీ వాజ్‌పేయి — ఇండిపెండెన్స్ డే విత్ రియల్ హీరోస్