హైదరాబాద్‌ రిలయ్‌ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేసే ఆలోచనలో ఉన్నారా.? మీ సందేహాలన్నింటికీ ఒకే సమాధనం ఇదే..

|

Apr 11, 2023 | 6:15 PM

సంపాదించే ప్రతీ ఒక్కరూ ఎంతో కొంత పొదుపు చేస్తుంటారు. ఇలా పొదుపు చేసిన మొత్తాన్ని రకరకాల రంగాల్లో పెట్టుబడులుగా పెడుతుంటారు. ఇలాంటి వాటిలో రియల్‌ ఎస్టేట్‌ మొదటి వరుసలో ఉంటుంది. రియల్‌ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌ చేసిన వారి నష్ట పోయిన సందర్భాలు లేవని చెబుతుంటారు...

హైదరాబాద్‌ రిలయ్‌ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేసే ఆలోచనలో ఉన్నారా.? మీ సందేహాలన్నింటికీ ఒకే సమాధనం ఇదే..
Tv9 Sweet Home
Follow us on

సంపాదించే ప్రతీ ఒక్కరూ ఎంతో కొంత పొదుపు చేస్తుంటారు. ఇలా పొదుపు చేసిన మొత్తాన్ని రకరకాల రంగాల్లో పెట్టుబడులుగా పెడుతుంటారు. ఇలాంటి వాటిలో రియల్‌ ఎస్టేట్‌ మొదటి వరుసలో ఉంటుంది. రియల్‌ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌ చేసిన వారి నష్ట పోయిన సందర్భాలు లేవని చెబుతుంటారు. అందుకే పెద్దలు కూడా కాస్త డబ్బు ఉంటో ఏదైనా ల్యాండ్‌ కొనేసేయ్‌ అని సలహా ఇస్తుంటారు. ఇల్లు, స్థలం, అపార్ట్‌మెంట్‌లో ఓ ఫ్లాట్‌.. ఇలా ఏదో ఒక పెట్టుబడి పెట్టాలని చాలా మంది ఆలోచనలో ఉంటారు. అయితే చేతిలో డబ్బున్నా.. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి.? ఎలా ఇన్వెస్ట్ చేయాలి.? ఎన్నో సందేహాలు ఉంటాయి. అయితే ఇలాంటి సందేహాలన్నింటినీ నివృత్తి చేయడానికి టీవీ9 తెలుగు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

మీరు ఎలాంటి స్థిరాస్తి కొనాలనుకున్నా నాణ్యమైన సలహా అవసరం. అందుకే మీ అవసరాలకు అనుగుణం గా మీ బడ్జెట్ పరిధిలో మీ స్థిరాస్తి కల నెరవేర్చుకునే వేదిక సిద్ధం చేసింది TV9 తెలుగు. తెలుగు రాష్ట్రాల్లో సొంత ఇల్లు, స్థలం, అపార్ట్మెంట్లు, కమర్షియల్ ప్రాపర్టీ, విల్లా, ఫాం హౌస్ ఎలాంటి స్థిరాస్తి కొనాలనుకున్నా మీరు సందర్శనాచాల్సిన ప్లేస్ TV9 Sweet Home Real Estate & Interior Expo. 100 కి పైగా ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ కంపెనీలు పాల్గొంటున్న ఈ ఎక్స్ పో ఈ నెల ఏప్రిల్ 14,15,16 తేదీల్లో 3 రోజుల పాటు హైటెక్ సిటీ లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో జరగనుంది. ప్లాట్, ఓపెన్ ప్లాట్, కమర్షియల్ ప్రొపర్టీ, రెసిడెన్షియల్ ప్రొపర్టీ, ఫామ్ హౌస్, విల్లా కొనాలనుకునేవారికి సరైన సమాచారాన్ని అందించే వేదిక TV9 Sweet Home Real Estate and Interior Expo .

ఇవి కూడా చదవండి

ఆకర్షణీయమైన ఇంటీరియర్, ఫర్నీచర్ మరియు అద్భుతమైన హెూం డెకొరేషన్ డిజైన్స్ కూడా వినియోగదారులకు అందించబోతోంది ఈ వేదిక. స్థిరాస్తి కొనాలనుకున్న వారికి ఋణ సదుపాయం కల్పించే బ్యాంక్ లు కూడా ఈ కార్యక్రమం లో పాల్గొంటున్నాయి. అన్ని తరగతుల వారి బడ్జెట్ కు తగిన స్థిరాస్తి మరియు ఉత్తమమైన ఇంటీరియర్ అందించడమే. ధ్యేయంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది TV9. ఈ ఏప్రిల్ 14 నుంచి 16 తేదీవరకు HITEX, హైటెక్ సిటీ, హైదరాబాద్ లో TV9 Sweet Home Real Estate & Interior Expo సందర్శించండి. ప్రవేశం ఉచితం.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..