TSRTC: ఈ అమవాస్యకు గానుగాపూర్‌ దత్తాత్రేయ స్వామి దర్శనం.. తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ

ప్రయాణికుల కోసం రకరకాల ఆఫర్లు తీసుకొస్తోంది తెలంగాణ ఆర్టీసీ. తెలుగు రాష్ట్రాలతో పాటు సమీపంలో ఉన్న ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక టూర్‌ ప్యాకేజీలను అందిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో ఆకర్షణీయమైన ప్యాకేజీతో ప్రయాణికులను ఆకర్షిస్తోంది తెలంగాణ ఆర్టీసీ. ఈ నెల 17న అమావాస్యను పురస్కరిఒచుకొని కర్ణాటకలోని గానుగాపూర్‌ దత్తాత్రేయ స్వామి...

TSRTC: ఈ అమవాస్యకు గానుగాపూర్‌ దత్తాత్రేయ స్వామి దర్శనం.. తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ
Tsrtc

Updated on: Jul 13, 2023 | 10:02 AM

ప్రయాణికుల కోసం రకరకాల ఆఫర్లు తీసుకొస్తోంది తెలంగాణ ఆర్టీసీ. తెలుగు రాష్ట్రాలతో పాటు సమీపంలో ఉన్న ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక టూర్‌ ప్యాకేజీలను అందిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో ఆకర్షణీయమైన ప్యాకేజీతో ప్రయాణికులను ఆకర్షిస్తోంది తెలంగాణ ఆర్టీసీ. ఈ నెల 17న అమావాస్యను పురస్కరిఒచుకొని కర్ణాటకలోని గానుగాపూర్‌ దత్తాత్రేయ స్వామి ఆలయానికి టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. దత్తాత్రేయ స్వామి ఆలయంతో పాటు మహారాష్ట్రాలోని పండరీపూర్‌, తుల్జాపూర్‌కు సర్వీసును నడిపిస్తున్నారు. ఈ టూర్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌, ధర వివరాలపై ఓ లుక్కేయండి..

16వ తేదీన బస్సు హైదరాబాద్‌లోని ఎంబీజీఎస్‌ నుంచి సాయంత్రం 6 గంటలకు బయలుదేరుతుంది. రాత్రి 11.30 గంటల సమయానికి గానుగాపూర్‌ చేరకుంటారు. అనంతరం 17వ తేదీన దత్తాత్రేయ స్వామి దర్శనం ఉంటుంది. ఇది పూర్తికాగానే అక్కడి నుంచి బయలు దేరుతారు. సాయంత్రం 4 గంటల సిరిక పండరీపూర్‌ చేరకుంటారు. అనంతరం అక్కడ దర్శనం పూర్తికాగానే రాత్రి 10 గంటలకు తుల్జాపూర్‌ వెళ్తారు. అక్కడ దర్శనం అనంతరం 18వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు హైదరాయబాద్‌ తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. అదేరోజు రాత్రి 8.30 గంటలకు ఎంబీజీఎస్‌కు చేరుకుంటారు.

ధర విషయానికొస్తే.. ఈ టికెట్‌ ధర రూ. 2500గా నిర్ణయించారు. టికెట్‌లో కేవలం ప్రయాణ సదుపాయం మాత్రమే కల్పిస్తారు. దర్శనం, భోజన, వసతి సదుపాయాలు ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది. ప్రయాణికులు టీఎస్‌ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్‌లో అడ్వాన్స్‌ బుకింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎంజీబీఎస్‌ లేదా జేబీఎస్‌, దిల్‌షుక్‌ నగర్‌ బస్‌ స్టేషన్స్‌లోని టికెట్ కౌంటర్‌లో బుక్‌ చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం 9440566379, 9959226257, 9959224911 నెంబర్లను సంప్రదించాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..