Hyderabad: రూ 2 వేలకే శ్రీశైలం ట్రిప్.. అద్దిరిపోయే టూర్ ప్యాకేజీని ప్రకటించిన ఆర్‌టీసీ.. పూర్తి వివరాలివే..

| Edited By: శివలీల గోపి తుల్వా

Jul 19, 2023 | 4:10 PM

TSRTC Tour Package: ప్రయాణికుల సౌలభ్యం కోసం ఎప్పకటికప్పుడు కార్యాచరణ సిద్దం చేస్తూ ముందుకు వెళ్తున్న TSRTC.. మరో కొత్త టూర్ ప్యాకేజ్ నీ ప్రకటిచింది. శ్రీశైలం వెళ్ళాలనుకునే భక్తుల కోసం కొత్త టూర్ ప్యాకేజ్‌ని అనౌన్స్ చేసింది. ప్రతి వీకెండ్ ఈ ప్రత్యేక సర్వీస్‌లు ఉంటాయని..

Hyderabad: రూ 2 వేలకే శ్రీశైలం ట్రిప్.. అద్దిరిపోయే టూర్ ప్యాకేజీని ప్రకటించిన ఆర్‌టీసీ.. పూర్తి వివరాలివే..
TSRTC Tour Package
Follow us on

TSRTC Tour Package: ప్రయాణికుల సౌలభ్యం కోసం ఎప్పకటికప్పుడు కార్యాచరణ సిద్దం చేస్తూ ముందుకు వెళ్తున్న TSRTC.. మరో కొత్త టూర్ ప్యాకేజ్ నీ ప్రకటిచింది. శ్రీశైలం వెళ్ళాలనుకునే భక్తుల కోసం కొత్త టూర్ ప్యాకేజ్‌ని అనౌన్స్ చేసింది. ప్రతి వీకెండ్ ఈ ప్రత్యేక సర్వీస్‌లు ఉంటాయని RTC అధికారులు అంటున్నారు. ఈ మేరకు ప్రతి శనివారం ఈ టూర్ స్టార్ట్ అవుతుంది. రెండు రోజుల పాటు సాగే టూర్‌లో శ్రీశైలం మల్లిఖార్జున స్వామి, భ్రమరాంబ దేవి, సాక్షి గణపతి దర్శనంతో పాటు శ్రీశైలం దగ్గర్లోని డ్యాం చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు చూడవచ్చు. ఈ టూర్ ప్యాకేజ్‌లో పెద్దవాళ్ళకు 2700 రూపాయలు, చిన్న పిల్లలకు 1570 రూపాయలు టికెట్ ఉంటుందని TSRTC అధికారులు చెబుతున్నారు.

ప్రతి శనివారం ఉదయం 7 గంటలకు సూపర్ లగ్జరీ బస్‌లో ఈ టూర్ jbs నుంచి స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 1.30 గంటలకి శ్రీశైలం చేరుకుంటుంది. మధ్యాహ్నం మూడు గంటల తరవాత పాతాళగంగ, కృష్ణ నదిలో బోటింగ్ తరవాత సాయంత్రం స్వామి వారి దర్శనం తరవాత శ్రీశైలంలోనే హోటల్‌లో బస ఏర్పాటు చేశారు అధికారులు. రెండవ రోజు ప్రత్యేక పూజల తరవాత శివాజి స్పూర్తి కేంద్రం, చెంచులక్ష్మి ట్రైబల్‌ మ్యూజియం సందర్శన తో పాటు అక్కడే చుట్టుపక్కల ప్రాంతాల పర్యటక ప్రాంతాల విజిట్ చేసుకొని సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ప్రయాణికులు ఫుడ్,ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు, ఇతర ఖర్చులను భరించాలి.

ఇవి కూడా చదవండి

ప్రతి రోజు శ్రీశైలంకి 40 సర్వీస్‌లు నడుపుతున్న ఆర్టిసి వీకెండ్ రద్దీ ఎక్కువగా ఉంటుందని ఈ స్పెషల్ ప్యాకేజ్ని రెడీ చేసింది. టూర్ వివరాల కోసం 040-69440000, 040-23450033ను సంప్రదించాలి అని అంటున్నారు TSRTC.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..