TSRTC Special Buses: ముచ్చింతల్‌ వేడుకకు సర్వం సిద్ధం.. హైదరాబాద్ నలుమూలల నుంచి ఆర్టీసీ స్పెషల్ బస్సులు

|

Feb 01, 2022 | 5:55 PM

హైదరాబాద్ నగరంలో పలు బస్ స్టేషన్‌ల నుండి బస్సులు ప్రతి గంటకు బయలు దేరనున్నాయి. ఈ క్రమంలోనే ఎంజీబీఎస్ , జేబీఎస్ , సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తోపాటు కాచిగూడా రైల్వే స్టేషన్‌ల నుంచి బస్సులు...

TSRTC Special Buses: ముచ్చింతల్‌ వేడుకకు సర్వం సిద్ధం.. హైదరాబాద్ నలుమూలల నుంచి ఆర్టీసీ స్పెషల్ బస్సులు
Tsrtc Arranges Special Buse
Follow us on

Statue of Equality: ముచ్చింతల్‌లోని చినజీయర్‌ స్వామి ఆశ్రమం(Chinna Jeeyar Swamy Ashram) శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు చినజీయర్‌ స్వామి ఆధ్వర్యంలో జరిగే వేడుకల్లో సమతామూర్తి పేరిట నిర్మించిన 216 అడుగుల శ్రీరామానుజాచార్యుల విగ్రహాన్ని( Ramanujacharya Statue) ఆవిష్కరించనున్నారు. ఫిబ్రవరి 5న ప్రధాని మోదీ(PM Modi) ముచ్చింతల్‌ పర్యటన ఖరారైంది. పీఎం కార్యాలయం నుంచి జీయర్‌స్వామి ఆశ్రమానికి సమాచారం అందింది. శ్రీరామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం ఇస్తారు ప్రధాని మోదీ. దాదాపు 4 నుంచి 5 గంటలపాటు మోదీ పర్యటన కొనసాగనుంది. 35 ఎకరాల విస్తీర్ణంలో 144 యాగశాలలు నిర్మించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 5వేల మంది రుత్వికులు, వేదపండితులు విచ్చేసి క్రతువులో పాల్గొంటారని సమాచారం.

ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా వస్తుండడంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం 120 కిలోల బంగారంతో 54 అంగుళాల రామానుజచార్యుల విగ్రహం ప్రతిష్టనించనున్నారు. కాగా ప్రధాని ఫిబ్రవరి 5న రానుండడంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. ఆయన భద్రత కోసం సుమారు 7వేల మంది పోలీసులు రక్షణ కల్పించనున్నారు. కాగా ప్రధాని నేరుగా ఢిల్లీ నుండి ముచ్చింతల్ ఆశ్రమంలోనే దిగనున్నారు.

శ్రీ రామానుజులవారి సహస్రాబ్ది ఉత్సావాలను పురస్కరించుకొని ముంచింతలలో ఏర్పాటుచేసిన 216 అడుగుల ఎత్తుగల రామానుజులవారి సమతామూర్తి విగ్రహావిష్కరణ,108 సాలగ్రామ విష్ణు మూర్తుల ఉపాలయాలు,1035 యజ్ఞ కుండికలతో మరియు 5000 ఋత్వికులతో జరిపే మహాయజ్ఞం చూడటానికి ప్రజల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల నుండి ముచ్చింతల్‌కు బస్సులను అందుబాటులో ఉంచనున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇదే అంశాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు.

కాగా హైదరాబాద్ నగరంలో పలు బస్ స్టేషన్‌ల నుండి బస్సులు ప్రతి గంటకు బయలు దేరనున్నాయి. ఈ క్రమంలోనే ఎంజీబీఎస్ , జేబీఎస్ , సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తోపాటు కాచిగూడా రైల్వే స్టేషన్‌ల నుంచి బస్సులు ఉదయం ఆరు గంటలకు, ఏడు గంటలకు, ఎనిమిది గంటలకు బస్సులు బయలు దేరనున్నాయి.

ఆర్టీసీ బస్సుల వివరాలు ఇలా..

  • ఉదయం 6గంటలకు .. 7గంటలకు
  • పఠాన్ చేరు – లింగంపల్లి- గచ్చిబౌలి – శంషాబాద్- ముచ్చింతల్ క్యాంపు
  • KPHB కూకట్పల్లి- SR నగర్ – పంజాగుట్ట – మెహిదీపట్నం- ఆరాంఘర్ష్ ముచ్చింతల్ క్యాంపు
  • మేడ్చల్ – కొంపల్లి- బాలానగర్- మెహిదీపట్నం- ఆరాంఘర్ష్ ముచ్చింతల్ క్యాంపు
  • ఘట్కేసర్ – ఉప్పల్- LB నగర్ – మిధాని – ఆరాంఘర్ – ముచ్చింతల్ క్యాంపు
  • ECIL – తారనాక- ఫెవర్ హాస్పిటల్ నారాయణగూడ లక్షికాపూల్- మెహిదీపట్నం ఆరాంఘర్ష్ ముచ్చింతల్ క్యాంపు
  • హయత్నగర్ – దిలుసుఖ్ నగర్ – MGBS – ఆరాంఘర్ ముచ్చింతల్ క్యాంపు

ఉదయం 6,7,8గంటలకు..

  • కాచిగూడ రైల్వేస్టేషన్ అఫ్టల్ గంజ్ జూ పార్క్ఆరాంఘర్ ముచ్చింతల్ క్యాంపు
  • నాంపల్లి రైల్వే స్టేషన్ అఫ్టల్ గంజ్ జూ పార్క్ ఆరాంఘర్ష్ ముచ్చింతల్ క్యాంపు
  • సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ – RTC X రోడ్డు ఫివర్ హాస్పిటల్ – అఫ్టల్ గంజ్- జూ పార్క్ – ఆరాంఘర్ – ముచ్చింతల్ క్యాంపు

ఇవి కూడా చదవండి: Viral Video: వామ్మో..! దీని తెలివి తెల్లరా.. రెక్కల సాయంతో చేపల వేట.. వీడియో చూస్తే బిత్తరపోతారు..

Budget 2022 Speech Highlights: త్వరలో డిజిటల్ ​కరెన్సీ.. దేశ ఆర్థిక వ్యవస్థకు నిర్మలమ్మ బూస్టర్..