TGSRTC: ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త… టికెట్ బుకింగ్‌లో కీలక మార్పులు..
ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త అందించింది. ప్రయాణికుల కోసం అనేక సౌకర్యాలు కల్పిస్తున్న ఆర్టీసీ.. టికెట్ల రిజర్వేషన్‌కు సంబంధించి కీలక మార్పులు చేసింది. జర్నీకి రెండు నెలలు ముందుగానే టికెట్లు బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం

Ticket Booking: న్యూ ఇయర్ రాబోతుంది.. ఆ తర్వాత కొద్ది రోజులకే సంక్రాంతి కూడా రానుంది. దీంతో బస్సుల్లో ఫుల్ రద్దీ ఏర్పడనుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని సొంతూరు వెళ్లాలనుకునేవారు ముందుగానే టికెట్లను బుక్ చేసుకుంటున్నారు. ప్రైవేట్ ట్రావెల్ ఆపరేటర్లు అధిక మొత్తంలో వేలల్లో వసూలు చేస్తున్నారు. ఈ తరుణంలో టికెట్ ధర తక్కువగా ఉండే ఆర్టీసీ బస్సుల్లో టికెట్ బుక్ చేసుకునేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపిస్తున్నారు. ఆర్టీసీ కూడా పండుగల సమయాల్లో ప్రైవేట్ ఆపరేటర్లుగా పోటీగా అనేక ఆఫర్లు ప్రకటిస్తోంది. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. బస్సుల్లో టికెట్ల ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని మరింతగా మెరుగుపర్చింది.
బస్సుల్లో 60 రోజుల ముందే రిజర్వేషన్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. గతంలో కూడా ఈ వెసులుబాటు ఉండగా.. చాలామందికి అవగాహన లేదు. దీంతో ప్రజలకు మరింత తెలిసేలా ప్రచారం చేయాలని టీజీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. పండుగలు, ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో మరింతగా ప్రచారం చేయనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ సౌకర్యం ద్వారా ప్రయాణికులు ముందే తమ టికెట్లను బుక్ చేసుకుని సౌకర్యవంతమైన ప్రయాణం చేయొచ్చని చెబుతున్నారు.
కాగా ప్రయాణికుల సౌలభ్యం కోసం ఆర్టీసీ అనేక కొత్త సౌకర్యాలు కల్పిస్తోంది. గమ్యం పేరుతో ఒక యాప్‌ను ప్రవేశపెట్టింది. ఈ యాప్ ద్వారా మీరు వెళ్లాలనుకునే బస్సు లైవ్ లొకేషన్‌ను చూడవచ్చు. బస్సు టైమింగ్స్‌తో పాటు స్టాపుల వివరాలను యాప్ ద్వారా ముందుగానే తెలుసుకోవచ్చు. అలాగే కొత్త రూట్లల్లో కూడా బస్సులను ఆర్టీసీ ప్రవేశపెడుతోంది. కొత్తగా స్లీపర్, ఏసీ బస్సులను కూడా తీసుకొస్తున్నారు.
